సహభావన టౌన్షిప్ సి బ్లాక్ - 2025 ఎన్నికల్లో యూనిటీ ప్యానెల్ ఘన విజయం
నాగోల్ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌లో ఉన్న సహభావన టౌన్షిప్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సి బ్లాక్ 2025 ఎన్నికల్లో యూనిటీ ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో యూనిటీ ప్యానెల్‌కు చెందిన అభ్యర్థులు, సమీప ప్రత్యర్థులైన డెమొక్రటిక్ ప్యానెల్ అభ్యర్థులపై ఆధిక్య మెజారిటీతో విజయం సాధించడం గమనార్హం.ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే అపార్ట్మెంట్ వాసులు ఘనంగా సెలబ్రేట్ చేశారు. విజయం సాధించిన అభ్యర్థులు అపార్ట్మెంట్ ఆవరణలో ర్యాలీ నిర్వహించి తమ అభినందనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సిహెచ్ శ్రీనివాసరావు, ప్యానల్ సభ్యులు మాట్లాడుతూ ... ‘‘మా ప్యానెల్‌కి మద్దతుగా నిలిచి గెలిపించిన ప్రతి ఓటరుకూ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజలు పెట్టిన నమ్మకాన్ని న్యాయంగా నిలబెట్టుకుంటాం. అపార్ట్మెంట్‌లోని ప్రతి సమస్యను ప్రాధాన్యతతో పరిష్కరిస్తాం. ఓనర్స్ మరియు రెంటర్ల కలసికట్టుతో శుభ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తాం’’ అని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించిన ఈసీ సభ్యులకు కూడా వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ పనితీరుతో అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, అందరి అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments