ఇంటినుండి వెళ్లిన వ్యక్తి అదృశ్యం

ఇంటినుండి వెళ్లిన వ్యక్తి అదృశ్యం

ఇంటినుండి వెళ్లిన వ్యక్తి అదృశ్యం

ఇబ్రహీంపట్నం, మే 21 ( నగరనిజం ) : ఇంటినుండి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. గ్రీన్ ఫార్మాసిటీ ఎస్ఐ తేజంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... యాచారం మండల పరిధిలోని కురుమిద్ద గ్రామానికి చెందిన మల్కాపురం నరసింహ ( 50 ) ఈ నెల 7న ఇంటినుండి ఉదయం 9 గంటల సమయంలో పనికోసం అని బయటకు వెళ్లి అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్ళల్లో, చుట్టూప్రక్కల గ్రామాలలో వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆచూకీ తెలిసిన వాళ్ళు 8712662724, 8712662725 నెంబర్లకు తెలియజేయాలని పోలీసులు తెలిపారు.

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు
మేడ్చల్:- మేడ్చల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు మారినట్లు విద్యుత్ శాఖ మేడ్చల్ ఏ.డి రాజ మల్లేష్ తెలిపారు కావున ఏదైనా...
నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు
కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమా?
మొద్దు లచ్చిరెడ్డికి సమస్యలపై వినతిపత్రం అందజేసిన గౌతమి నగర్ కాలనీ వాసులు
రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హయత్‌నగర్‌లో నివాళులు
బీసీల చైతన్యానికి గ్రామపర్యటనలు
రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు