సాహెబ్ నగర్ లోని శ్రీశ్రీశ్రీ త్రినేత్ర హనుమాన్ ఆలయ జాతర మహోత్సవం
సాహెబ్ నగర్ లోని శ్రీశ్రీశ్రీ త్రినేత్ర హనుమాన్ ఆలయ జాతర మహోత్సవం గ్రామ ప్రజలు, ఈవో మురళీకృష్ణ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుండి మూడు రోజుల్లో భాగంగా రెండవ రోజు కనుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా జాతర మహోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ జాతరలో, ఎగ్జిబిషను ఏర్పాటు చేశారు. రెండవ రోజు గురువారం నాడు కళ్యాణ మహోత్సవం నిర్వహించి ఊరేగింపు కార్యక్రమం కాలనీ పురవీధుల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో డీజే పాటలతో నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదేవిధంగా ఘనంగా జాతర మహోత్సవం నిర్వహిస్తామని అన్నారు. వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసామని అన్నారు. తమకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆ ఆంజనేయ స్వామి దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముద్దగోని చంద్రకాంత్ గౌడ్, నాగరాజ్, నాంపల్లి నాగరాజ్, నారాయణ, మహేష్, బిక్షపతి, బాల్ రాజ్, శ్రీనివాస్, గ్రామ ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments