మారోజు వీరన్నను స్మరించుకుందాం

సామాజిక తెలంగాణాను నిర్మించుకుందాం

మారోజు వీరన్నను స్మరించుకుందాం

IMG-20250515-WA2145మారోజు వీరన్న స్వగ్రామమైన కర్విరాల కొత్తగూడెంలో ఆయన స్థూపం వద్ద 26వ వర్దంతికి నివాళులు అర్పించడానికి వస్తున్న ఆయన అభిమానులు, కవులు, కళాకారులు, సాహిత్య వేత్తలు, మేధావులు, బీసీ సమాజానికి ఆయన పోరాట స్ఫూర్తి గుర్తు చేస్తూ... నా కలం నుండి జాలువారిన అక్షరాలు ఒకసారి తెరచి చూస్తే... 

 దేశంలో కులగణన జరగాలని, తద్వారా కుల జనాభా దామాషా ప్రకారం హక్కులు, రాజకీయ వాటా సాధించుకోగల్గుతామని చెప్పిన వీరన్నకు యావత్ తెలంగాణ ప్రజలు విప్లవ జోహార్లు పలికి ప్రథమంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మేమెంతో మాకంత వాటా అంటూ కుల సంఘటిత పోరాట సంఘాలు స్థాపించి, వర్గ - కుల సిద్ధాంతం రూపొందించి పోరాడిన మారోజు వీరన్నను 1999 మే16 న ఆనాటి సీమాంధ్ర పాలన పొట్టన పెట్టుకుంది. ఇది హేయమైన చర్యగా తెలంగాణ రాష్ట్ర సమాజం భావించింది. తెలంగాణ వీర సాయుధ పోరాటం తర్వాత మారోజు వీరన్న చేసిన సామాజిక తెలంగాణ పోరాట కృషి మరువలేనిది. తన స్ఫూర్తి తో తెగించి కొట్లాడిన బీసీ ఉద్యమ కారుల వల్ల 2014లో తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యింది. ఈ మధ్య కాలంలో కేంద్రం కుల జనగణన కు అంగీకరించింది. భవిష్యత్తులో బహుజన కులాలు ఏకమై మేమంత మందిమో... మకంత వాటా అంటూ... పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పాడు మారోజు. ఈ విషయంలో వీరన్న కేవలం తన 37 ఏండ్ల వయస్సులోనే సుదీర్ఘ పోరాటం అనిపించుకున్న పోరాట యోధుడిగా చరిత్రలో నిలిచి, ఎంతో మంది ఉద్యమకారులకు ఆదర్శప్రాయుడయ్యాడు. బూటకపు ఎన్ కౌంటర్ లో వీరన్నను బలి తీసుకోవడం లోనే ఆయన పోరాటం ఏమిటో తెలుస్తుంది. వీరన్న విశ్వకర్మ కులంలో పుట్టినప్పటికీ ఆయన ఆశయాలు మాత్రం యావత్ తెలంగాణ ప్రజలే నా బతుకు జీవనం అన్నట్టుగా సాగాడు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండలం, కరివిరాల కొత్తగూడెం వీరన్నది. వీరన్న రూపొందించిన వర్గ-కుల సిద్ధాంతం బీసీ కులాలనే కాకుండా అణగారిన వర్గ ప్రజలను ఏకం చేసే విధంగా బంధుత్వాన్ని కలిపింది. వీరన్న ఆలోచనతో లలితక్క గొల్ల-కురుమ డోలు దెబ్బ మోగించి సంచలనం సృష్టించిన సంగతి యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు. వీరన్న సూర్యాపేటలో పెట్టిన తెలంగాణ మహాసభతో, వీరన్న ఆధ్వర్యంలో లలితక్క భువనగిరిలో తెలంగాణ జనసభతో తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటానికి ఊపిరయ్యింది. వీరన్న సాంప్రదాయక విప్లవ ఉద్యమాలు కలిగించి తిరుగుబాటుకు ఊపిరి పోశారు. వీరుల సాహసాలే సామాజిక ముందడుగుకు ఇంధనాలని చెప్తారు మేధావులు. యంత్రానికి ఇంధనం ఎంత ముఖ్యమో పోరాటానికి వీరన్న స్ఫూర్తి అంత ముఖ్యమని, వీరన్న పోరాట చరిత్ర గుర్తు చేసుకుంటేనే హక్కుల సాధన కోసం మరో ముందడుగు వేయగలుగుతుంది. వీరన్న స్వప్నం సామాజిక తెలంగాణ. ప్రస్తుతం నడుస్తున్న బీసీ ఉద్యమాలు రానున్న రోజుల్లో సామాజిక తెలంగాణాలో బహుజన రాజ్య స్థాపనగా మలచుకోవాలి. ఏమరపాటు లేకుండా బహుజన రాజ్య స్థాపన సాధించుకోవడానికి 136 బీసీ కులాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకొని రాజ్య సాధన కోసం ముందుకు సాగాలి. బహుజన రాజ్య స్థాపనే లక్ష్యంగా పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు తమ తమ పరిధిలో పోటీ చేసి గెలిచే విధంగా ఒకరికొకరు సహకరించుకోవాలి. చట్టసభలలో బీసీ వాటా అమలు అయ్యేంతవరకు కులాల మధ్య సమన్వయం లోపించకుండా చూసుకోవాలి. బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న ఆర్ కృష్ణన్న. కృష్ణన్న వారసత్వం తీన్మార్ మల్లన్న అంది పుచ్చుకుని బీసీ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన తీసుకురావడం, దీనితోపాటు బత్తుల సిద్దేశ్వర్ ఆమరణ దీక్ష, మాజీ విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు మేదో మధనం, అనేక బీసీ ఉద్యమకారుల ఉన్నత పోరాటాలతో రాష్ట్రంలో కుల జనగణన సాధించుకున్నాం. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టాలన్న వీరన్న ఆశయం ద్వారా కొంత సాధించుకోగలిగాం. ఈ విషయంలో కేంద్రం దేశ వ్యాప్త కుల గణన చేయడానికి అంగీకరించింది. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం బీసీ ఉద్యమ శక్తులు సాధించిన చారిత్రక విజయమిదిగా మరొకసారి గుర్తుకు చేసుకోవాలి. అయితే ఇల్లలుకగానే పండుగ కాదు. విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో దామాషా ప్రకారం బీసీ రిజర్వేన్ కు రాజ్యాంగ బద్దత సాదించుకోవాల్సి ఉంది. ఈ విషయంలో రాష్ట్రం కేంద్రం పై, కేంద్రం రాష్ట్రంపై చేతులు వేసి దులుపుకుంటున్నవేళ మరో పోరాటం రగిలించి ముందుకు సాగవలసిన అవసరం కూడా ఉంది. మా పని బిల్లులు పెట్టడం తోనే అయిపోయిందని రాష్ట్రం, ముస్లిం బూచి చూపిస్తూ దాంట్లో 9వ షెడ్యూల్లో పెట్టడం సాధ్యం కాదని కేంద్రం అంటుంది. నిజానికి ఆధిపత్య కుల పార్టీలన్నీ బీసీ వ్యతిరేక వైఖరిని కలిగివుంటాయని, వీరి బీసీ వ్యతిరేక వైఖరిని ఎండగడుతూనే తక్షణం విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్ కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద పోరాటం చేయాల్సిన సందర్భమిదిగా ఉద్యమించాలి.

 ఈ నేపథ్యంలో బీసీ సమాజం తెలంగాణ బీసీ సమరయోధుడైన మారోజు వీరన్న పోరాట స్ఫూర్తినీ కలిగించుకొని, నేటి, మేటి, మేధావులు, కవులు, సాహిత్యవేత్తలు, కళాకారులు, వారి వారి రచనలతో, పాటలతో, మాటలతో, ప్రేరణ పెంపొందించుకోవాలి. తద్వారా వీరన్న కలలు గన్న సామాజిక తెలంగాణలో అందరూ భాగస్వామ్యం కావాలి. సబ్బండ కులాల రాజ్య స్థాపన చేసుకోవాలి. వీరన్న 26వ వర్ధంతి ని గుర్తు చేసుకోవడం భవిష్యత్ తరాలకు వారి చరిత్రలను తెలియ చెప్పడం అందరి బాధ్యతగా ఉండాలి. వారి ఆశయ సాధన కోసం పోరాడటమే బహుజన కులాలు వారికి ఇవ్వగలిగిన నిజమైన నివాళి అని భావిద్దాం.

వ్యాసకర్త:

యస్.బి.ఎన్ చారి, జర్నలిస్ట్, విశ్వకర్మ జేఏసీ కన్వీనర్ 9440189819

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు
మేడ్చల్:- మేడ్చల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు మారినట్లు విద్యుత్ శాఖ మేడ్చల్ ఏ.డి రాజ మల్లేష్ తెలిపారు కావున ఏదైనా...
నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు
కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమా?
మొద్దు లచ్చిరెడ్డికి సమస్యలపై వినతిపత్రం అందజేసిన గౌతమి నగర్ కాలనీ వాసులు
రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హయత్‌నగర్‌లో నివాళులు
బీసీల చైతన్యానికి గ్రామపర్యటనలు
రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు