అఖండ భారత ప్రజల హృదయ స్పందన ఆపరేషన్ సింధూర్ - మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్
మేడ్చల్ :-భారత త్రివిధ దళాల ఆపరేషన్ సింధూర్ విజయానికి మద్దతుగా మనం సైతం దేశం కోసం తిరంగా ర్యాలీ బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మున్సిపాలిటీ అధ్యక్షురాలు శైలజ.నేతృత్వంలో మేడ్చల్ పుర వీధుల గుండా వందలాది మంది ప్రజలు మరియు బిజెపి శ్రేణులతో కలిసి నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రబూతం భారత మహిళా మణుల సింధూరాన్ని హరిస్తే భారత త్రివిధ దళాల నేతృత్వంలో పాక్ సైన్యం,ఐఎస్‌ఐ ప్రేరణతోనే పహల్గాంలో ఉగ్రవాదులు హేయ నరమేధానికి ప్రతిస్పందనగా ‘ఆపరేషన్ సిందూర్’తో గర్జించిన భారత్- సామాన్య పౌరులకు ప్రమాదం వాటిల్లకుండా తన సార్వభౌమత్వానికి సవాలు విసురుతున్న ముష్కర మూకలపై విరుచుకుపడడం గర్వకారణం అని పేర్కొన్న ఎంపీ ఈటల రాజేందర్ అదే సమయంలో మహిళా సైనికాధికారిణులు కల్నల్ సోఫియా ఖురేషి మరియు వ్యోమికా సింగ్ ల ద్వారా మహిళా పౌరుషాన్ని చాటిన అపూర్వ విజయం అని ఆయన కొనియాడాడు...ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా మాజీ అధ్యక్షులు పట్లోల్ల విక్రమ్ రెడ్డి,రాష్ట్ర నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి,నాగారం మాజీ మున్సిపల్ చైర్మెన్ చంద్రా రెడ్డి,తిరంగా ర్యాలీ కన్వీనర్ సామల పవన్ రెడ్డి,కో కన్వీనర్ సంపత్ యాదవ్,మాజీ కౌన్సిలర్లు హంస కృష్ణ గౌడ్,దొడ్ల మల్లికార్జున్,అమరం సరస్వతి,నాయకులు లక్ష్మా రెడ్డి,మోహన్ రెడ్డి,గౌరారం జగన్ గౌడ్, కొండం ఆంజనేయులు,నరేందర్ రెడ్డి,రామన్న గారి శ్రీనివాస్ గౌడ్,లవంగ శ్రీకాంత్,జకట ప్రేమ్ దాస్,హేమలత రెడ్డి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు
Comments