సబ్సిడీ కోసం దరఖాస్తులు
రంగారెడ్డి. / నగర నిజం : 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రధాన మంత్రి ఫార్మాలైజేషన్ అఫ్ మైక్రోపుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (PMEME) పథకం క్రింద క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ కోసం దరఖాస్తులు స్వీకరించుట గురించి.ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ క్రింద ప్రారంభించబడిన PM ఫార్మాలైజేషన్ ఆఫ్ మిక్రోఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (PMEME స్కీమ్ అనేది భారత ప్రభుత్వం (MoFPI) మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అమలు పరుస్తున్న పథకం. ఇది ఫుడ్ ప్రొసెస్సింగ్ సెక్టర్లోని అసంఘటిత విభాగంలో ప్రస్తుతము వున్న వ్యక్తిగత సూక్ష్మ సంస్థల పోటీతత్వాన్ని పెంపొందించడానికి మరియు ఈ రంగంలో ఉన్న సూక్ష్మ సంస్థలను లాంఛనప్రాయముగా చేయడానికి మరియు రైతు ఉత్పత్తిదారు సంస్థలు, స్వయం సహాయక బృందాలకు మద్దత్తు అందించడానికి ఉద్దేశించిన కేంద్ర మరియు రాష్ట్ర ప్రాయోజిత పథకం.
> సూక్ష్మ సంస్థల యొక్క వ్యక్తిగత మరియు గ్రూపులకు మద్దతు.
> బ్రాండింగ్ మరియు మార్కెటింగ్.
> అర్హత కలిగిన వ్యక్తి గత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్ ఖర్చులో 35% శాతం గరిష్ట పరిమితితో యూనిట్ కు రూ.10.00 లక్షల వరకు ఋణ అనుసంధాన రాయితీ.
> సంస్థల బలోపేతం కొరకు మద్దతు.
> బలమైన ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ ప్రేమ్ వర్క్ ఏర్పాటు చేయడం.
వ్యక్తిగత సూక్ష్మ సంస్థలకు ట్రైనింగ్ మరియు హ్యాండ్ వెల్డింగ్ సపోర్ట్.
వ్యక్తిగత మరియు గ్రూప్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కొరకు ప్రతిపాదనలు https://pmfme.motpl.gov.irypmtme/#Login లో దాఖలు చేయవలెను.
(DRP) Chitla Shiva Sal, Mobil No.7672012800
జిల్లా పరిశ్రమల కేంద్రం- 2nd Floor, జిల్లా కలెక్టర్ కార్యాలయము, కొంగరకలన్, రంగారెడ్డి జిల్లాను సంప్రదించగలరు.
జనరల్ మేనేజర్,
జిల్లా పరిశ్రమల కేంద్రం, రంగారెడ్డి జిల్లా
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments