ప్రైవేటు పాఠశాల వద్దు ప్రభుత్వ పాఠశాల ముద్దు

ప్రైవేటు పాఠశాల వద్దు ప్రభుత్వ పాఠశాల ముద్దు

మేడ్చల్ మే 19, (నగర నిజం)ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లను పెంచాలని ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా జడ్.పి.హెచ్.ఎస్ నూతనకల్ అడ్మిషన్లను ఆహ్వానిస్తూ పాఠశాలలో వచ్చిన ఉత్తమ ఫలితాలను ప్రదర్శిస్తూ పాఠశాల ప్రత్యేకతలను వివరిస్తూ నూతనకల్ గ్రామ కూడలిలో హోర్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను బోధించే ఉపాధ్యాయులు ఎంఏ, పి హెచ్ డి, బిఈడి వంటి చదువులు చదివిన మరియు ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే విద్య బోధించబడును మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ మరియు ప్రభుత్వం తరఫున ఉచిత పుస్తకాలు మరియు దాతల సహాయంతో నోటు బుక్స్ మరియు స్కూల్ యూనిఫామ్ బ్యాగు వంటివి ఉచితంగా ఇవ్వబడును మరియు పుష్టికరమైన మధ్యాహ్న భోజనం ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తుంది, సొంత గ్రామంలోని పిల్లలు చదువుకున్నట్లయితే ప్రయాణ సమయము మరియు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చదువుకోగలరు, మరియు విద్యార్థుల తల్లిదండ్రులతో విద్యా కమిటీ పర్యవేక్షణలో ప్రతి నెల గ్రామ నాయకులు ఆధ్వర్యంలో విద్యా కమిటీ మీటింగ్ నిర్వహించబడును, విద్యార్థులకు ఎటువంటి ఒత్తిడి లేకుండా మనసుకు అర్థమయ్యే విధంగా తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం లో విద్య బోధించబడును, గతంలో నూతనకల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు మంచి ఉన్నత స్థానాలలో ఉండడం జరిగింది కావున దయచేసి గ్రామస్తులు అందరూ పాఠశాలలో విద్యార్థులందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి డబ్బును ఆదా చేసుకోవాలని ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలని ప్రధానోపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి కోరారు,ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే విజయభాస్కర్ రెడ్డి,ఉపాధ్యాయులు పి ప్రభాకర్, రమాదేవి,మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు
మేడ్చల్:- మేడ్చల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు మారినట్లు విద్యుత్ శాఖ మేడ్చల్ ఏ.డి రాజ మల్లేష్ తెలిపారు కావున ఏదైనా...
నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు
కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమా?
మొద్దు లచ్చిరెడ్డికి సమస్యలపై వినతిపత్రం అందజేసిన గౌతమి నగర్ కాలనీ వాసులు
రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హయత్‌నగర్‌లో నివాళులు
బీసీల చైతన్యానికి గ్రామపర్యటనలు
రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు