మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
మేడ్చల్ మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబిల్ పూర్ గ్రామ చివారులోని శ్రీరామ స్పిన్నింగ్ మిల్ వద్ద రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదలలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మరణించి ఉన్నాడని 100 డయల్ ద్వారా మేడ్చల్ పోలీసులకు సమాచారం వచ్చినట్లు ఎస్సై అనిత తెలిపారు. శ్రీరామ్ స్పిన్నింగ్ మిల్ సెక్యూరిటీ గార్డుని పోలీసులు వివరాలు అడగగా, 13.05.2025న సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మిల్లు దగ్గరకు వచ్చి ఆహారం, నీళ్లు కావాలని సెక్యూరిటీ గార్డ్ ని వేడుకున్నట్టు తెలిపారు, సెక్యూరిటీ గార్డు , గుర్తు తెలియని వ్యక్తి వివరాలు అడగగా ఎటువంటి వివరాలు వెల్లడించలేదని, త్రాగడానికి మంచినీళ్లు కావాలని అడిగినట్లు తెలిపారు, మంచినీళ్లు తాగిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తి స్పిన్నింగ్ మిల్లు సమీపంలోని పొదల దగ్గరకు వెళ్లాడని సెక్యూరిటీ గార్డ్ తెలిపినట్టుగా చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తి 14.05.2025 రోజున సాయంత్రం 6:30 గంటల సమయంలో సెక్యూరిటీ గార్డు ఆ గుర్తు తెలియని వ్యక్తి చనిపోయినట్లు గమనించి. మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించినట్లుగా మేడ్చల్ ఎస్సై అనిత,తెలిపారు గుర్తుతెలియని వ్యక్తి కి సరియైన ఆహారం నీరు లేక లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల మరణించవచ్చు అని ఎస్సై అనిత తెలిపారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలిపారు
Comments