శంషాబాద్ లో ట్రైనీ కానిస్టేబుల్ ఘరానా మోసం

శంషాబాద్ లో ట్రైనీ కానిస్టేబుల్ ఘరానా మోసం

నిందితుడు పీటీఓ కానిస్టేబుల్ నిస్సార్ అహ్మద్ ను అరెస్టు చేసిన ఆర్.జి.ఐ.ఏ పోలీసులు

ప్రభుత్వం పోలీసులకు మంజూరు చేసే ఫాస్టాగ్ స్టిక్కర్లను చోరీ చేసి ప్రైవేట్ క్యాబులకు విక్రయిస్తున్న కంత్రీ

నిందితుడి అరెస్ట్, మూడు ప్రైవేట్ క్యాబులు సీస్ 

రాజేంద్రనగర్, మే 19
(నగరనిజం ప్రతినిధి):

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ లో ఓ ట్రైనింగ్ కానిస్టేబుల్ ఘరానా మోసాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ పోలీసులు నిందితుడు నిస్సార్ అహ్మద్ ను అరెస్టు చేయడంతో పాటు మూడు ప్రైవేటు క్యాబులను సీజ్ చేశారు. శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ ఇన్స్పెక్టర్ బాలరాజు కథనం ప్రకారం పోలీసు కానిస్టేబుల్ ఘరానా మోసానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు నిస్సార్  అహ్మద్ (30) అనే యువకుడు గత కొంతకాలంగా శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ పోలీస్ స్టేషన్ లో పీటీఓ అండర్ ట్రైనీ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే శిక్షణ కాలంలోనే మనోడు రాటు తేలిపోయాడు. పోలీసు వాహనాల కోసం ప్రభుత్వం మంజూరు చేసే ఫాస్టాగ్ స్టిక్కర్లను చోరీ చేస్తూ వాటిని ప్రైవేట్ క్యాబులకు విక్రయించి సొమ్ము చేసుకోవడం వృత్తిగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ నుండి 10 ఫాస్టాగ్ స్టిక్కర్లను చోరీ చేసిన నిందితుడు నిస్సార్ అహ్మద్.... వాటిని ప్రైవేట్ క్యాబులకు విక్రయించాడు. ఇందుకోసం ఒక్కో వాహనానికి ఒక్కో రేటు నిర్ణయించాడు.విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రైవేటు క్యాబులకు నెలకు 8000, ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రయాణించే ప్రైవేట్ క్యాబ్ వాహనాలకు 2000 చొప్పున వసూలు చేస్తున్నాడు. అయితే ఫాస్టాగ్ వ్యవహారంపై అనుమానం రావడంతో ఔటర్ రింగ్ రోడ్డు టోల్ గేట్ మేనేజర్ శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంకేముంది ఔటర్ రింగ్ రోడ్డు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ పోలీసులు.... తీగ లాగితే డొంక కదిలిన చందంగా ట్రైనీ కానిస్టేబుల్ ఫాస్టాగ్ స్టిక్కర్ల అవినీతి బాగోతం వెలుగు చూసింది. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి మూడు క్యాబులను సీజ్ చేసినట్లు సీఐ బాలరాజు ప్రకటించారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Related Posts

Post Your Comment

Comments

Latest News

అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు
  మేడ్చల్ :-ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తను మాట్లాడుతూ నిన్నటి రోజు
మేడ్చల్ పట్టణంలో గ్రేటర్ ఆర్యవైశ్య బిజినెస్ లీడర్స్ సమావేశం
త్రాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నాం డబిల్ పూర్ గ్రామవాసులు
మేడ్చల్లో పురపాలక సంఘం కమిషనర్ల బదిలీలు
విరిగిన లారీ ఎక్సెల్ తృటిలో తప్పిన పెను ప్రమాదం
మేడ్చల్ లో కేబుల్ వైర్లను తొలగించిన విద్యుత్ అధికారులు
లింగాపూర్ డబిల్ పూర్ గ్రామాల మధ్య రాకపోకల బందు