చాణిక్యపురి కాలనీలో స్వచ్ఛభారత్
పాల్గొన్న నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్
నాగోల్ డివిజన్ పరిధిలోని చాణక్యపురి కాలనీలో స్వచభారత్ కార్యక్రమంలో పాల్గొన్న నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,కాలనీలో రోడ్లపై ఎలాంటి చెత్తచెదరాలు ఉండకుండా, ఎప్పటికప్పుడు కి తీసేస్తూ ఉండాలి అని ,జిహెచ్ఎంసి సిబ్బందికి తెలియజేశారు..మరియు కాలనీ వాసులు ఎవరు కూడా రోడ్లపై చెత్త వేయకుండా స్వచ ఆటో నీ ఉపయోగించుకోవాలి.అలాగే ప్రతి 15రోజులకు ఒకసారి స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రతి కాలనీ లో నిర్వహించలని అన్నారు..ఇలాగా చేస్తే ప్రతి కాలనీ కూడా స్వచ్ఛభారత్ నిర్వహిస్తే కాలనీ పరిశుభ్రంగా ఉంటుంది ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉంటామని అన్నారు.అనంతరం జిహెచ్ఎంసి నుండి వచ్చిన స్పోర్ట్స్ కిట్స్ ను కాలనీ వాసులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ చలపతి రెడ్డి,వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డి,జనరల్ సెక్రటరీ శ్రీధర్ బాబు,కాలనీ వాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారు
Comments