రోడ్డు ప్రయాణంలో గాయలెన్నో..
రోడ్లు ఇలా ప్రయాణాలు ఎలా..
బిఆర్ఎస్ పార్టీ యూత్ గ్రామ కమిటీ అధ్యక్షులు పాల నర్సింలు..
పండుగ అనిల్ కుమార్..
చౌడాపూర్ మండల ప్రతినిధి మే 19 (నగర నిజం):
రోడ్లు ఇలా ఉంటే ప్రయాణాలు చేసేది ఎలా అని విఠలాపూర్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ యూవజన విభాగం అధ్యక్షులు పాల నర్సింలు,వాహన చోదకులు ప్రశ్నిస్తున్నారు.మండల పరిధి నుండి విఠలాపూర్,గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా శిథిలమయ్యాయి.శిథిలమైన గతుకుల రోడ్లపై ప్రయాణాలు చేయడం వాహన చోదకులకు గగనంగా మారింది.సంవత్సరాల క్రితం నిర్మించిన రోడ్లు ఆలనా పాలనా లేక పోవడంతో శిథిలావస్థకు చేరుకుని వాహనాల ప్రయాణాలకు ఏ మాత్రం పనికిరాకుండా పోయాయి.గత ప్రభుత్వ హయాంలో నూతన రోడ్ల నిర్మాణానికి ఇచ్చిన ప్రాధాన్యత పాత రోడ్ల మరమ్మతులకు ఇవ్వకపోవడంతో అవి పూర్తిగా శిథిలమయ్యాయి.ఆ రోడ్లపై ప్రయాణాలు చేయడానికి వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు.రోడ్డు ప్రయాణలలో ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు..వారం రోజుల క్రింద రోడ్డు ప్రమాదం జరిగి ప్రయాణికుడికి తీవ్రంగా గాయలైనాయి.రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎవ్వరు చూడకుంటే ప్రయాణికుడు అక్కడే ప్రాణాలు విడిచే పరిస్థితి నెలకొంది.
యామలోకాన్ని తలపిస్తున్న రోడ్లు..
పండుగ అనిల్ కుమార్..
రోడ్లు ఇలా ఉంటే ప్రయాణాలు చేసేది ఎలా అని బిఆర్ఎస్ పార్టీ యూవజన విభాగం ఉపాధ్యక్షులు పండుగ అనిల్ కుమార్,వాహన చోదకులు ప్రశ్నిస్తున్నారు.మండలంలో గ్రామీణ రోడ్లు పూర్తిగా శిథిలమయ్యాయి. శిథిలమైన గతుకుల రోడ్లపై ప్రయాణాలు చేయడం వాహన చోదకులకు గగనంగా మారింది.సంవత్సరాల క్రితం నిర్మించిన రోడ్లు ఆలనా పాలనా లేక పోవడంతో శిథిలావస్థకు చేరుకుని వాహనాల ప్రయాణాలకు ఏ మాత్రం పనికిరాకుండా పోయాయి.గత ప్రభుత్వ హయాంలో నూతన రోడ్ల నిర్మాణానికి ఇచ్చిన ప్రాధాన్యత పాత రోడ్ల మరమ్మతులకు ఇవ్వకపోవడంతో అవి పూర్తిగా శిథిలమయ్యాయి.ఆ రోడ్ల పై ప్రయాణాలు చేయడానికి వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments