శ్రీ త్రినేత్ర ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మధుయాష్కి గౌడ్
వనస్థలిపురం ,బి.యన్.రెడ్డి నగర్ డివిజన్లోని సాహెబ్ నగర్‌లోని శ్రీ త్రినేత్ర ఆంజనేయ స్వామి దేవాలయ జాతరను పురస్కరించుకొని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ బుధవారం నాడు దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి ఆశీస్సులు పొందారు. అనంతరం దేవాలయ వచ్చిన భక్తులకు అభివందనాలు తెలిపారు..పూజల అనంతరం దేవాలయ కమిటీ సభ్యులు మధుయాష్కి గౌడ్‌కు సన్మానం నిర్వహించారు. జాతరలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ...దేవాలయాలు మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తాయని, ఇలాంటి పవిత్రమైన సందర్భాల్లో పాల్గొనడం గర్వంగా ఉందని తెలిపారు. ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో విజయపథంలో సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో యువ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కడి శివ చరణ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ముద్దగోని లక్ష్మీ ప్రసన్న, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు మకుటం సదాశివుడు, వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు కుట్ల నరసింహ యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్, నేలపాటి రామారావు, బుడ్డా సత్యనారాయణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోడ రాజశేఖర్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు రమేష్ నాయక్, నాయకులు నారాయణ, కొండోజు శ్రీనివాస్, చంద్రకాంత్ గౌడ్, కిరణ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments