రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

' రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి '

రైతు సంక్షేమమే సహకార సంఘాల ధ్యేయం

రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

రాష్ట్ర టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య

ఇబ్రహీంపట్నం, మార్చి 17 ( నగరనిజం ): రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. రైతు సంక్షేమమే రైతు సేవా సహకార సంఘం యొక్క ప్రధాన ధ్యేయమని అన్నారు. శనివారం తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం యొక్క పాలకవర్గ సమావేశం సంఘం చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అధ్యక్షతన సంఘం ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఇట్టి సమావేశంలో 11 మందిని నూతన సభ్యులుగా చేర్చుకున్నారు. 9 మంది రైతులకు రూ.1 కోటి 25 లక్షల రూపాయలు అప్పులు మంజూరు చేశారు. 2024 -25 ఆర్థిక సంవత్సరం, త్రైమాసిక జమ ఖర్చులు లెక్కలు ఆమోదించారు. సంఘం 2025 - 26 ఆర్థిక సంవత్సరం అనంతరం సంఘ సభ్యుల సంక్షేమం కొరకు ఇతర అభివృధి కార్యక్రమాలు చేయుటకు ఆమోదించారు. ఈ సందర్భంగా సంఘం చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య మాట్లాడుతూ... రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించి సంఘం అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా రైతు సేవా సహకార సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. రైతు సంక్షేమమే సంఘం యొక్క ప్రధాన ధ్యేయమని అన్నారు. సహకార సంఘాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు వివరించారు. రైతుల ఆర్థికాభిృద్దే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నట్లు చెప్పారు. రైతులను ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు సహకార సంఘాలు కృషి చేస్తాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు అన్నారు. తడిసిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొంటుందని పేర్కొన్నారు. సమావేశంలో రైతుబంధు జిల్లా మాజీ చైర్మన్, డైరెక్టర్ వంగేటి లక్ష్మారెడ్డి, సంఘం వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, సంఘం డైరెక్టర్లు కొండ్రు స్వప్న శ్రీనివాస్, జక్క కృష్ణారెడ్డి, చెక్క లక్ష్మమ్మ, సామ సంజీవ రెడ్డి, నర్సింగ్ రావు, చాపల యాదగిరి, శీలం లక్ష్మమ్మ, సామ సత్యనారాయణ రెడ్డి, సీఈవో వై.రాందాస్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు
మేడ్చల్:- మేడ్చల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు మారినట్లు విద్యుత్ శాఖ మేడ్చల్ ఏ.డి రాజ మల్లేష్ తెలిపారు కావున ఏదైనా...
నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు
కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమా?
మొద్దు లచ్చిరెడ్డికి సమస్యలపై వినతిపత్రం అందజేసిన గౌతమి నగర్ కాలనీ వాసులు
రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హయత్‌నగర్‌లో నివాళులు
బీసీల చైతన్యానికి గ్రామపర్యటనలు
రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు