మే 24 (శనివారం)హయత్ నగర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం
శ్రీ సాయి పాలి క్లినిక్ అండ్ యాగ్నస్టిక్ సెంటర్, యశోద హాస్పిటల్ నేతృత్వంలో ఉచిత మెగా వైద్య శిబిరం
హయత్‌నగర్ డివిజన్‌లోని కుంట్లూరు రోడ్డులో ఉన్న చింతచెట్ల సమీపంలోని, అంజమ్మ కాంప్లెక్స్‌లో శ్రీ సాయి పాలి క్లినిక్ అండ్ డయాగ్నస్టిక్ సెంటర్ మరియు యశోద హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల ( మే)24న శనివారం నాడు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు క్లినిక్ నిర్వాహకులు గోరింట్ల పుల్లారావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... సమాజంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ ఆశయమని, అందుకే సామాన్య ప్రజలకు మేలు కలగాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. చిన్నపిల్లల ఆరోగ్య సమస్యలు, బిపి, షుగర్, కీళ్లనొప్పులు, స్త్రీల ఆరోగ్య సమస్యలు, క్యాన్సర్ వంటి కీలక వ్యాధులతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలపై అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ వైద్యులచే పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు.ఇంకా షుగర్, ఈసీజీ, 2డి ఈకో, బీఎండీ వంటి అత్యవసర పరీక్షలను ఉచితంగా చేస్తారు.ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని కోరారు. చుట్టుపక్కల కాలనీల ప్రజలు, పరిసర ప్రాంత వాసులు పెద్దఎత్తున పాల్గొనాలని గోరింట్ల పుల్లారావు విజ్ఞప్తి చేశారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments