ఇష్టంతో కష్ట పడండి
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
రక్షణకు యుద్ధ సైనికులు... గ్రామనికి సైనికులు పంచాయతీ సెక్రటరీలు....
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క.
పంచాయతీ సిబ్బందిని గౌరవించిన పంచాయతీరాజ్ మంత్రి సీతక్క
రంగారెడ్డి /నగర నిజం : తెలంగాణ పంచాయతీ సెక్రెటరీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనం పెద్ద అంబర్పేట్‌లోని వీఆర్‌సీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర మంత్రి సీతక్క,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇబ్రహీంపట్నం శాసనసభ సభ్యుడు మల్ రెడ్డి రంగారెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి , మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, గౌరవ అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్టు మాజీ జెడ్పిటిసి బింగి దేవదాస్ గౌడ్, తదితర ప్రజాప్రతినిధులు, సంఘం నాయకులు, హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ....ఇష్టంతో కష్టపడుతూ గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న పంచాయతీ సెక్రటరీలు గ్రామ సైనికుల్లా పనిచేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలుగా ఉన్నాయని, వాటి అభివృద్ధికి కృషి చేస్తున్న సిబ్బందిని ప్రభుత్వం ఆదరిస్తుందని పేర్కొన్నారు.మంత్రి సీతక్క మాట్లాడుతూ... పంచాయతీ సెక్రటరీలకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని తనకు కూడా తెలుసని తెలిపారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఏ, వీఆర్వోలను తొలగించి గ్రామాల్లో పరిపాలన గందరగోళంగా మారిందని విమర్శించారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నూతన చర్యలు చేపట్టిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేక సమీక్ష నిర్వహించి పంచాయతీ సెక్రటరీల సమస్యలను పరిష్కరించేందుకు ముందుంటానని తెలిపారు.ఏ సమస్య వచ్చినా తాను నేరుగా స్పందిస్తానని చెప్పిన సీతక్క... కారుణ్య నియామకాలు కూడా ప్రభుత్వం చేపట్టిందని గుర్తుచేశారు. పంచాయతీరాజ్ సిబ్బందికి, ముఖ్యంగా సెక్రటరీలకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు అందేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. అనంతరం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ కార్యదర్శులు, సంఘ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు తమ సమస్యలు సూచనలను పంచుకున్నారు.
గతంలో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో పనిచేసిన పంచాయతీ సెక్రెటరీ పీర్ల వెంకన్న ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి సంఘం నాయకులు రెండు లక్షల ఆర్థిక సాయాన్ని మంత్రి సీతక్కతో అందజేశారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్