నానక్ రామ్ గూడలో రోడ్డు భద్రత, ఆర్థిక భద్రతపై అవగాహన కార్యక్రమం

నానక్ రామ్ గూడలో రోడ్డు భద్రత, ఆర్థిక భద్రతపై అవగాహన కార్యక్రమం

సైబరాబాద్, మే 16 (నానక్ రామ్ గూడ)  : NAGARA NIJAM : "2047 నాటికి అందరికీ భీమా" లక్ష్యాన్ని సాధించే దిశగా శ్రిరామ్ లైఫ్ ఇన్షూరెన్స్ సంస్థ అడుగులు వేసింది. సంస్థ స్థాపనకు 20 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా, శ్రిరామ్ లైఫ్ ఇన్షూరెన్స్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) కలిసి నానక్ రామ్ గూడ ట్రాఫిక్ జంక్షన్‌లో రోడ్డు భద్రత, ఆర్థిక భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఉపయోగించడం ఎంతో అవసరం అనే విషయాన్ని తెలియజేశారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి ఉచితంగా హెల్మెట్లు అందించి, వాటిని సరైన రీతిలో ధరించాలన్న అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో శ్రిరామ్ లైఫ్ ఇన్షూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈవో క్యాస్పరస్ జె.హెచ్. క్రోంహౌట్, మాధాపూర్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ఎస్‌సీఎస్‌సీ సీఈఓ నవేద్ ఆలంఖాన్, శ్రిరామ్ లైఫ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ అజిత్ బెనర్జీ, స్ట్రాటజిక్ అడ్వైజర్ రవి కుమార్, మల్టీ ప్రోడక్ట్స్ హెడ్ సునీతా సమ్బరాజు, లీడ్ ఇన్షూరర్ ప్రాజెక్ట్ ఏజీఎం జాన్ మనోజ్, గచ్చిబౌలి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సురేష్, మహిళా భద్రతా విభాగానికి చెందిన లలితా టిమ్స్, కేశవ్ భండారీలు పాల్గొన్నారు. అలాగే ఎస్‌సీఎస్‌సీ ట్రాఫిక్ వాలంటీర్లు కూడా బైక్ ర్యాలీకి మద్దతుగా నిలిచారు.తెలంగాణ రాష్ట్రానికి లీడ్ ఇన్షూరర్‌గా ఉన్న శ్రిరామ్ లైఫ్ ఇన్షూరెన్స్, భీమా పై అవగాహనతో పాటు ప్రజల రక్షణకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఉచిత హెల్మెట్ల పంపిణీ ద్వారా రోడ్డు భద్రతపై వారి నిబద్ధతను చాటుకుంది.ఈ కార్యక్రమంలో శ్రిరామ్ లైఫ్ నాయకత్వ బృందంతో పాటు ఇన్షూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ)కి చెందిన అధికారులు, రాయల్ సుందరం లీడ్ నాన్-లైఫ్ ఇన్షూరర్, ఎల్ఐసీతో సహా ఇతర జీవిత భీమా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. భీమా రంగం సమిష్టిగా ప్రజల భద్రత కోసం పనిచేస్తున్నట్లు ఈ సందర్భంగా స్పష్టమైంది.అత్యంత ఆర్థికపరంగా బలహీనమైన కుటుంబాలకూ భీమా రక్షణ కల్పించాలన్న లక్ష్యంతో శ్రిరామ్ లైఫ్ ఇన్షూరెన్స్ గతంలోనూ రోడ్డు భద్రతపై అనేక కార్యక్రమాలు నిర్వహించింది.2

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు
మేడ్చల్:- మేడ్చల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు మారినట్లు విద్యుత్ శాఖ మేడ్చల్ ఏ.డి రాజ మల్లేష్ తెలిపారు కావున ఏదైనా...
నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు
కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమా?
మొద్దు లచ్చిరెడ్డికి సమస్యలపై వినతిపత్రం అందజేసిన గౌతమి నగర్ కాలనీ వాసులు
రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హయత్‌నగర్‌లో నివాళులు
బీసీల చైతన్యానికి గ్రామపర్యటనలు
రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు