కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమా?
నడిరోడ్డుపై తెరిచి ఉన్న మ్యాన్ హోల్
స్థానికులకు ఇబ్బందికరంగా మారిన సగం రోడ్డు ఇలాంటి సగం పనులు మునుపు ఎన్నడూ చూడలేదు బుగ్గోని గూడ గ్రామస్తులు
షాద్ నగర్ ప్రతినిధి మే 21 నగర నిజం : నందిగామ మండల పరిధిలోని చేగూరు ఉమ్మడి గ్రామపంచాయతీ బుగ్గోనీగూడ గ్రామంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా? నిధుల కోరతానా! అసంపూర్తిగా రోడ్డు పనులు. పూర్తి చేసేది ఎన్నడో, మ్యాన్ హోల్ తెరిచి ఉండడంతో చిన్నపిల్లలకు ప్రమాదంగా మారింది. వివరాల్లోకి వెళితే బుగ్గోని గూడ గ్రామపంచాయతీ హనుమాన్ టెంపుల్ కు వెళ్లే సీసీ రోడ్డు మార్గం ఇబ్బందికరంగా మారింది. సగం వరకు పనులు పూర్తి చేశారు. మిగతా సగం వదిలేశారు. ఈ పరిస్థితులతో నిత్యం అటుగా వెళ్లే చిన్నపిల్లలకు ప్రమాదకరంగా మారింది మ్యాన్ హోల్ తెరిచి ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉన్నది అని స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.
మా ఇబ్బందులు తొలగించండి మహాప్రభు...
సీసీ రోడ్డు సగం పూర్తి అవ్వడంతో మ్యానువోల్ తెరిచి ఉండడంతో ప్రమాదం పొంచి ఉన్నది. వర్షాలు పడ్డప్పుడు తెరిచిన మ్యానువోల్ ద్వారా రోడ్డుపై ఉన్న చెత్త చెదారమంతా, అండర్ డ్రైనేజ్ పైప్ లైన్ లోకి వెళుతున్నది. కనుక తక్షణమే సంబంధిత శాఖ అధికారులు స్పందించి. సగం కాంక్రీట్ రోడ్ ని పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాము. బుగ్గోనిగూడ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments