రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రవేశాలు

2025-26 సంవత్సరమునకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పధకము క్రింద షెడ్యూల్డ్ కులాల విద్యార్థినీ విద్యార్థులకు రెసిడెన్సియల్ మరియు నాన్ రెసిడెన్సియల్ గా ప్రవేశము కల్పించి విద్యను అందించేందుకు ఉత్సాహము కలిగి, ఈ పధకమునందు ఆసక్తి చూపుతున్న రంగారెడ్డి జిల్లా నందలి పేరొందిన పాఠశాలల నుండి దరఖాస్తులు కోరబడమైనది

అట్టి పాఠశాలలు:

1. గత (5) సంవత్సరములలో 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత 90 శాతము కలిగి ఉండాలి. అందులో కనీసం 50 శాతము విద్యార్థులు ఉత్తీర్ణత ప్రధమశ్రేణిలో ఉండాలి.

2. రాష్ట్ర సెకండరి బోర్డు లేదా సి.బి.యస్.సి లేదా ఐ.సి. యసి.సి. లచే గుర్తింపు పొందినవై ఉండాలి.

3. తగిన మౌలిక వనరులు అనగా తరగతి గదులు, కుర్చీలు, బల్లలు, ప్రయోగశాలాలు, లైబ్రరి, కంప్యుటర్ ల్యాబ్ లతోపాటు తగినంత ఆటస్థలం, క్రీడాపరికారాలు / సామగ్రి మొదలగునవి ఉండవలెను.

4. చదువులతోపాటు ఆటపాటలయందు సాంస్కృతిక కార్యక్రమాల యందు తగిన శ్రద్ధ చూపిస్తూ విద్యార్థిలోని అంతర్గత శక్తులను బయలపరచే విధంగా విద్య బోధన ఉండాలి.

5. తగినంత మంది బోధనా, బోధనేతర సిబ్బంది (సి.బి.యస్.ఐ నిబంధనల ప్రకారం) కలిగి ఉండి అందులో కనీసం 50 శాతం శాశ్వత సిబ్బందిని కలిగి ఉండాలి.

6. రెసిడెన్సియల్ పాఠశాలల యందు వసతి సౌకర్యములు అనగా నివాసపు గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, స్నానపు గదులు, భోజనశాల మున్నగునవి ఉండవలెను.

అర్హతకలిగి, ఆసక్తి చూపుతున్న పాఠశాలలు తేది. 26-05-2025లోపు ఈ పాస్ వెబ్ (https://telanganaepass.cgg.gov.in) ధ్రువపత్రాలను ఈ కార్యాలయమునకు అనగా జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ వారి కార్యాలయము, ఐ.డి.ఒ.సి. బిల్డింగు, రంగారెడ్డి కలెక్టరు కార్యాలముము, కొంగరకలాన్, ఇబ్రహీం పట్నం,రంగారెడ్డి జిల్లా మందు సమర్పించవలెను.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు
మేడ్చల్:- మేడ్చల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు మారినట్లు విద్యుత్ శాఖ మేడ్చల్ ఏ.డి రాజ మల్లేష్ తెలిపారు కావున ఏదైనా...
నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు
కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమా?
మొద్దు లచ్చిరెడ్డికి సమస్యలపై వినతిపత్రం అందజేసిన గౌతమి నగర్ కాలనీ వాసులు
రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హయత్‌నగర్‌లో నివాళులు
బీసీల చైతన్యానికి గ్రామపర్యటనలు
రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు