శ్రీ త్రినేత్ర ఆంజనేయ స్వామిని దర్శించుకున్న కార్పొరేటర్ లచ్చిరెడ్డి
బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్ శ్రీ త్రినేత్ర ఆంజనేయస్వామి జాతర సందర్భంగా బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి ఆంజనేయ స్వాములవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి ఆంజనేయ స్వామి దివ్య ఆశీస్సులను పొందారు. కార్పొరేటర్ మాట్లాడుతూ .ప్రతి సంవత్సరం శ్రీ త్రినేత్ర ఆంజనేయ స్వామి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని జాతరకు విచ్చేసే భక్తులందరికీ ఆంజనేయ స్వామి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.ఆంజనేయస్వామి జాతరకు విచ్చేస్తున్న భక్తులకు ఆ భగవంతుని కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయినీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మురళీకృష్ణ,డివిజన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రావు, కొంగర మహేష్,చందు గౌడ్, నాగరాజుగౌడ్, శివ శంకర్ గౌడ్, రాజు గౌడ్, సిద్దేశ్వర్, మహేందర్ రెడ్డి, రాజు, విజయ్, సురేష్ కుమార్,నివాస్, బాలకృష్ణ, కిరణ్, దుర్గాప్రసాద్, వికాస్,చందు, మధు, సాయి, సోను, మరియు తదితరులు ఉన్నారు.
About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment


Comments