సచివాలయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని సన్మానించిన గద్దె విజయనేత
బి.యన్ రెడ్డి నగర్ డివిజన్లోని సచివాలయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నిక కావడం జరిగింది.దీనిలో భాగంగా ప్రెసిడెంట్, నూతన కార్యవర్గ సభ్యులను గద్దె విజయ్ నేత (బి.ఎన్.రెడ్డి డివిజన్ టిడిపి అభ్యర్థి) , శ్రీధర్ శాలువాతో సన్మానించారు. నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నూతన కార్యవర్గం కాలనీ అభివృద్ధికి దోహదపడాలని వారు అన్నారు. ఈకార్యక్రమంలో సచివాలయ నగర్ అధ్యక్షులు పింగాలి సాంబశివరావు, వైస్ ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డి, ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి బాల్ రెడ్డి, కోశాధికారి రవికుమార్, స్పోర్ట్స్ సెక్రటరీ శ్రీధర్ కుమార్, ఆర్గనైజేషన్ సెక్రటరీ సూర్యనారాయణ, కల్చరల్ సెక్రటరీ హరీష్, ఈసీ మెంబర్లు సుధీర్, హరి గోపాల్, నరసింహారెడ్డి, ఎమ్మెస్సార్ మూర్తి, రవికుమార్, మాజీ అధ్యక్షుడు కుర్మా రావు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments