ఘనంగా సినిమా స్క్రిప్ట్ పూజా కార్యక్రమం
కళాత్రుష్ణ ఫిలిం ఇన్స్టిట్యూట్ సమర్పణలో ప్రేమ్ n ప్రేమ్ ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మించబోతున్న నూతన చిత్ర పూజ కార్యక్రమం శ్రీ. పోచమ్మ తల్లి ఆలయం లో ఘనంగా జరిగింది. ప్రేమ్ కమల్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్ర పూజ కార్యక్రమానికి ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణీ ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర బృందానికి ఆశీసులు అందచేశారు. పవన్, ప్రేమ్ రంజన్, సుప్రియ, చిత్తరంజన్ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధించాలని, చిత్ర బృందానికి మరెన్ని మంచి అవకాశాలు రావాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నట్టు తనికెళ్ళ భరణి తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుండి మొదటి షెడ్యూల్ ప్రారంభిస్తున్నట్టు చిత్ర బృందం మీడియా కు తెలిపింది. త్వరలోనే చిత్ర టైటిల్ ను ఓ ఈవెంట్ లో ఆవిష్కరించబోతున్నట్లు తెలిపారు. ఈ చిత్రం లో పవన్, ప్రేమ్ రంజన్, సుప్రియ, చిత్తరంజన్, అలేఖ్య, రవి తేజ, వెంకట్, పురుషోత్తం, సత్యనారాయణ, బ్రహ్మానందం, సంజీవ్ కర్నాటి, జశ్వంత్, రవీంద్ర రెడ్డి, కవిత, హర్షిత, రాగ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా : తేజ, ఎడిటర్ : ప్రేమ్ రంజన్, కో డైరెక్టర్: యోగి, అసోసియేట్ డైరెక్టర్: కిరణ్, అసిస్టెంట్ డైరెక్టర్: జయరాజ్, రాకేష్, ఆన్లైన్ ఎడిటర్స్: JP, ఫణీంద్ర,లైన్ ప్రొడ్యూసర్: కమలరంజన్ రచనా దర్శకత్వం : ప్రేమ్ కమల్. తదితరులు పాల్గొన్నారు.
About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment


Comments