తొండుపల్లిలో నేటి నుండి ఫ్రీ లివర్ హెల్త్ క్యాంప్ - పారేపల్లి లావణ్య శ్రీనివాస్ గౌడ్
సోమవారం నుండి శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు కొనసాగనున్న క్యాంప్
రాజేంద్రనగర్, మే 19,(నగరనిజం ప్రతినిధి):రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లిలో సోమవారం (నేటి) నుండి ఐదు రోజుల పాటు ఉచిత లివర్ హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు స్థానిక మాజీ కౌన్సిలర్ పారేపల్లి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. గచ్చిబౌలి ఏఐజి ఆసుపత్రి తో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించబోతున్నట్లు లావణ్య శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. తొండుపల్లి లోని 10,11,12 వార్డుల్లో సోమవారం నుండి శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని పారేపల్లి లావణ్య శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.10, 11,12 వార్డులకు సంబంధించిన మాజీ కౌన్సిలర్లు పారేపల్లి లావణ్య శ్రీనివాస్ గౌడ్, పెదిరిపాటి రాణి యాదయ్య గౌడ్(పెదిరిపాటి ప్రవీణ్ గౌడ్), కొండా ప్రవీణ్ గౌడ్ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని పర్యవేక్షించడం జరుగుతుందని పేర్కొన్నారు. తొండుపల్లి లోని జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ లో ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఉచిత లివర్ వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పారేపల్లి లావణ్య శ్రీనివాస్ గౌడ్ సూచించారు. 10, 11, 12 వార్డుల పరిధిలోని దాదాపు పదివేల మంది ప్రజానీకానికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల చేత స్కానింగ్, రక్త పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, తొండుపల్లి ప్రజానీకం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లావణ్య శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments