పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన

అర్హులైన విధ్యార్థులు కార్పొరేట్ విద్యను సద్వినియోగం చేసుకోవాలి

పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన

పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన

ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ విధ్యార్థులు మాత్రమే అర్హులు

అర్హులైన పేద విధ్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

ఇబ్రహీంపట్నం కార్తికేయ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకాంత్

ఇబ్రహీంపట్నం, మే 20 ( నగరనిజం ) : ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థిని,విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన అందజేయనున్నామని ఇబ్రహీంపట్నం కార్తికేయ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకాంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇబ్రహీంపట్నంలో అత్యాధునిక హంగులతో కార్పొరేట్ స్థాయిలో కార్తికేయ జూనియర్ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. కళాశాలలో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించామన్నారు. డీఆర్డీఏ స్కీం కింద ఉచిత విద్య, ఉచిత హాస్టల్ సౌకర్యంతో ఇంటర్ విద్యను, ఈఎపీసీఈటీ విద్యను అందజేయనున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు 10వ తరగతి పరీక్షలో 400 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు వెంటనే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31 చివరి తేదీ అన్నారు. కార్తికేయ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ చంద్రకాంత్ ను సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9959997635, 9346088364 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని సూచించారు. కేవలం ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ హాస్టళ్లలో, గురుకులాలు, కేజీపీవీ హాస్టళ్లలో చదివిన వారు మాత్రమే అర్హులన్నారు. 2025 సంవత్సరానికి సంబందించిన పదవ తరగతిలో 400 పైన మార్కులు సాధించిన వారు మాత్రమే అర్హులన్నారు. ఇంటర్లో కేవలం ఎంపీసీ, బైపీసీలో మాత్రమే ప్రవేశం పొందేందుకు అవకాశం ఉందన్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, ఈపీఏఎస్.సీజీజీ.జీవోవీ.ఇన్ వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలన్నారు. కులం ఆదాయం, ఆధార్ కార్డు, 4వ తరగతి నుంచి 10 తరగతి వరకు బోనాఫైడ్, పదోతరగతి సర్టిఫికెట్ జత చేయాలన్నారు. విద్యార్థులు చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇబ్రహీంపట్నం కార్తికేయ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకాంత్ సూచించారు.

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు
మేడ్చల్:- మేడ్చల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు మారినట్లు విద్యుత్ శాఖ మేడ్చల్ ఏ.డి రాజ మల్లేష్ తెలిపారు కావున ఏదైనా...
నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు
కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమా?
మొద్దు లచ్చిరెడ్డికి సమస్యలపై వినతిపత్రం అందజేసిన గౌతమి నగర్ కాలనీ వాసులు
రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హయత్‌నగర్‌లో నివాళులు
బీసీల చైతన్యానికి గ్రామపర్యటనలు
రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు