దేశవ్యాప్తంగా వ్యవసాయ సంకల్ప్ అభియాన్ ప్రారంభం

దేశవ్యాప్తంగా 700 కి పైగా జిల్లాల్లో నిర్వహణ : కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్

దేశవ్యాప్తంగా వ్యవసాయ సంకల్ప్ అభియాన్ ప్రారంభం

IMG-20250517-WA1771హైదరాబాద్‌ / నగర నిజం : అభివృద్ధి చెందిన వ్యవసాయ సంకల్ప్ అభియాన్ పేరుతో దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో మిషన్ ప్రారంభమైంది. మే 29న ప్రారంభమై జూన్ 12 వరకు ఈ కార్యక్రమం 700కి పైగా జిల్లాల్లో ఒకేసారి కొనసాగనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ, ఐసిఎఆర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రచారంపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సెంట్రల్ డ్రైల్యాండ్ వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, ఈ అభియాన్‌లో శాస్త్రవేత్తలు, అధికారులు, స్థానిక వ్యవసాయ కార్మికులతో బృందాలు ఏర్పడి గ్రామాలకు వెళ్లి రైతులతో నేరుగా మిళమవుతారని, శాస్త్రీయ సమాచారం, సలహాలు అందజేస్తారని చెప్పారు. “ప్రయోగశాల నుంచి భూమికి” అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్యేయాన్ని కార్యరూపంలోకి తీసుకెళ్లేందుకు ఇది కీలక మిషన్‌గా కొనియాడారు.ఈ చొరవ ద్వారా "ఒక దేశం, ఒక వ్యవసాయం, ఒక బృందం" లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన సమీక్షా సమావేశంలో 731 కృషి విజ్ఞాన కేంద్రాలు, 100కు పైగా ఐసిఎఆర్ సంస్థలు, కేంద్ర వ్యవసాయశాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ కార్యదర్శి దేవేష్ చతుర్వేది, ఐసిఎఆర్ డైరెక్టర్ జనరల్ మంగి లాల్ జాట్ హాజరయ్యారు.తెలంగాణలో కూడా ఈ ప్రచారాన్ని అత్యంత ఉత్సాహంగా చేపట్టనున్నారు. సీఆర్ఐడీఏకి చెందిన 25 మందికి పైగా శాస్త్రవేత్తలు జిల్లాల్లోని రైతులను కలిసి వారి స్థాయిలో సమస్యలు తెలుసుకుని మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ ప్రచారంలో కొత్త రకాలు, ఆధునిక పద్ధతులు, సహజ వ్యవసాయంపై అవగాహన కల్పించడం, సాయిల్ హెల్త్ కార్డ్ ఆధారంగా సమతుల్య ఎరువుల వాడకం ప్రోత్సహించడం లక్ష్యంగా పనిచేయనున్నారు.డ్రోన్ సాంకేతికత వినియోగం, ఐసిటి ఆధారిత పరిజ్ఞానం, డైరెక్ట్ సీడింగ్ ఆఫ్ రైస్ (DSR), పంట వైవిధ్యీకరణ, యాంత్రీకరణ వంటి అంశాలపై కూడా ప్రచారం సాగుతుంది. ఈ బృందాల్లో అధికారులు, ప్రగతిశీల రైతులు, వ్యవసాయ సంస్థలు, మహిళా సంఘాలు, తెగులు నిఘా అధికారులు పాల్గొంటారు.“ఇది ఏ సాధారణ ప్రచారం కాదు. ఇది రైతులకు ప్రత్యక్ష లాభం కలిగించే వినూత్న కార్యక్రమం. ఖరీఫ్ సీజన్ తర్వాతే దీని పాజిటివ్ ఫలితాలు కనిపిస్తాయి,” అని కేంద్ర మంత్రి చౌహాన్ స్పష్టం చేశారు. రైతులు సంపన్నులవ్వాలంటే శాస్త్రీయంగా వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. శాస్త్రవేత్తలు, అధికారులు, రైతుల సమిష్టి కృషితో అభివృద్ధి చెందిన వ్యవసాయం లక్ష్యంగా ఈ అభియాన్ విజయవంతం చేయాలన్నారు.

 

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు
మేడ్చల్:- మేడ్చల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు మారినట్లు విద్యుత్ శాఖ మేడ్చల్ ఏ.డి రాజ మల్లేష్ తెలిపారు కావున ఏదైనా...
నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు
కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమా?
మొద్దు లచ్చిరెడ్డికి సమస్యలపై వినతిపత్రం అందజేసిన గౌతమి నగర్ కాలనీ వాసులు
రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హయత్‌నగర్‌లో నివాళులు
బీసీల చైతన్యానికి గ్రామపర్యటనలు
రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు