ఎల్బీనగర్ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కొత్త రవీందర్ గౌడ్ ఘనంగా జన్మదిన వేడుకలు
కొత్త రవీందర్ గౌడ్ కు శుభాకాంక్షలు వెల్లువ
ఎల్బీనగర్ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కొత్త రవీందర్ గౌడ్ జన్మదిన శుభాకాంక్షలు చింతలకుంటలోని బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం పటాకులతో, ఫ్లెక్సీలతో అలంకరించబడింది. కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై రవీందర్ గౌడ్‌ను సన్మానించారు. కేక్ కట్ చేసి పూలమాలలతో అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు సామ రంగారెడ్డి, జిల్లా అధ్యక్షులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన డివిజన్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు. నాయకత్వ లక్షణాలతో కూడిన రవీందర్ గౌడ్ మరింత ముందుకెళ్లాలని, బీజేపీ బలపడేలా కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు. పార్టీ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, కృషి ప్రసంసనీయమని నేతలు పేర్కొన్నారు. వృద్ధులు, యువతతోపాటు మహిళలు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆత్మీయతతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జెక్కిడి ప్రభాకర్ రెడ్డి, నీలా అంజన్ కుమార్ గౌడ్,నాయిని శ్రీకాంత్ రెడ్డి,నక్క రాజేష్ గౌడ్, చిట్టుప్రోలు రవి కుమార్ , అరుణ్ జోగి, గంగాపురం రామాంజనేయులు గౌడ్, కాటం క్రాంతి గౌడ్, కొత్త మనోజ్ గౌడ్, కాకర్ల చైతన్య గౌడ్, నాయకులు ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments