మొద్దు లచ్చిరెడ్డికి సమస్యలపై వినతిపత్రం అందజేసిన గౌతమి నగర్ కాలనీ వాసులు
బి.యన్.రెడ్డి నగర్ డివిజన్‌లో గౌతమి నగర్ నూతన కార్యవర్గం ఏర్పాటు కావడంతో సంక్షేమ సంఘం సభ్యులు బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ను కలసి కాలనీలో అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ కాలనీలో ఉన్న ప్రతి సమస్యకు త్వరలోనే పరిష్కారం కల్పించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాలనీ నూతన అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కిషన్, ఖజానాదారు సాయిబాబా, ఉపాధ్యక్షులు రాజు, నారాయణరావు, సంయుక్త కార్యదర్శులు గోపీచంద్, హరి రెడ్డి, సుకుమార్, ఆంజనేయులు, లోకేష్ చారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కరుణాకర్, P.H. రెడ్డి, రవికుమార్, కార్యవర్గ సభ్యులు భాస్కర్ గౌడ్, జగన్, శ్రీరామ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments