ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎల్బీ.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత

IMG-20250515-WA1226ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. మన్సురాబాద్ డివిజన్ చిత్ర సీమ కాలనీలో గురువారం నిర్వహించిన శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి 12వ వార్షికోత్సవాలు, శాంతి కళ్యాణ మహోత్సవాల్లో వేరువేరుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కాలనీలో వార్షికోత్సవాలు జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు చేసుకొని మానసికంగా ప్రశాంతంగా ఉండాలని, స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తులతూగాలని భగవంతుని ప్రార్థించారు. అనంతరం దేవాలయ కమిటీ వారు మాట్లాడుతూ,మూడు రోజుల పాటు జరిగిన కల్యాణ మహోత్సవాలు గురువారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంతో ప్రశాంతంగా ముగిసాయని తెలిపారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజ జీయర్ స్వామి వారి మంగళ శాసనములతో ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. అనంతరం అన్నదాత రాగూరి ధనుంజయరెడ్డి శ్రీలత ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో దాదాపు వెయ్యి మందికి పైగా భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి,మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, డివిజన్ బారాస అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి, ఈశ్వరమ్మ యాదవ్,వేములయ్య గౌడ్, శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ పి. వెంకటేశ్వర్లు,జనరల్ సెక్రెటరీ టి. నాగేశ్వరరావు చిత్ర సీమ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పి. మోహన్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ డి. వెంకటరమణ, వైస్ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాం భూపాల్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, అశోక్ కుమార్, జె. జె. రెడ్డి, శ్రీనివాస్, వి. వెంకట్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, సంతోష్ కుమార్, చంద్రశేఖర్, పి.ఎం.ఎస్. కుమార్,అంకయ్య కాలనీ వాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు
మేడ్చల్:- మేడ్చల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు మారినట్లు విద్యుత్ శాఖ మేడ్చల్ ఏ.డి రాజ మల్లేష్ తెలిపారు కావున ఏదైనా...
నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు
కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమా?
మొద్దు లచ్చిరెడ్డికి సమస్యలపై వినతిపత్రం అందజేసిన గౌతమి నగర్ కాలనీ వాసులు
రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హయత్‌నగర్‌లో నివాళులు
బీసీల చైతన్యానికి గ్రామపర్యటనలు
రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు