అత్వెలి మహిళ హత్య కేసును చేదించిన మేడ్చల్ పోలీసులు

అత్వెలి మహిళ హత్య కేసును చేదించిన మేడ్చల్ పోలీసులు

మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వేల్లి గ్రామంలో ఈ నెల 16వ తేదీన జరిగిన మహిళ హత్య కేసును మేడ్చల్ పోలీసులు చేదించారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో డిసిపి కోటిరెడ్డి వివరాలను వెల్లడించారు.మేడ్చల్ బస్టాప్ పరిసరాల్లోని సాంకేతిక ఆధారాలు, సిసిటివి ఫుటేజ్‌ల ద్వారా పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.నిందితుడు  కటికే రాకేష్ ( 24 ) లేబర్ గా పనులు చేస్తూ దిల్ సుఖ్ నగర్ కు చెందిన వాడు‌ అని అతని వద్ద నుండి బంగారు చెవిపోగులు,ముక్కుపుడక లు: 05 గ్రాములు,వెండి కడియాలు వెండి బ్రాస్లెట్, వెండి ఉంగరం: 60 గ్రాములు.నగదు రూ. 3,500/-లను నిందితుని నుండి రికవరీ చేశామని డిసిపి కోటిరెడ్డి తెలిపారు. అతి తక్కువ సమయంలో  ఈ కేసును చేదించినందుకు పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎసిపి శంకర్ రెడ్డి, సిఐ సత్యనారాయణ, డి ఐ సుధీర్ కృష్ణ, ఎస్సైలు మన్మధరావు, అశోక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు
మేడ్చల్:- మేడ్చల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు మారినట్లు విద్యుత్ శాఖ మేడ్చల్ ఏ.డి రాజ మల్లేష్ తెలిపారు కావున ఏదైనా...
నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు
కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమా?
మొద్దు లచ్చిరెడ్డికి సమస్యలపై వినతిపత్రం అందజేసిన గౌతమి నగర్ కాలనీ వాసులు
రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హయత్‌నగర్‌లో నివాళులు
బీసీల చైతన్యానికి గ్రామపర్యటనలు
రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు