బీసీల చైతన్యానికి గ్రామపర్యటనలు
మన ఆలోచన సాధన సమితి
బీసీలను చైతన్యపరచడానికి గ్రామపర్యటనలు నిర్వహిస్తున్నామని మన ఆలోచన సాధన సమితి (మాస్) వ్యవస్థాపకులు కటకం నర్సింగ్ రావు తెలిపారు. నర్సాపురలోని లైన్స్ క్లబ్‌లో బుధవారం నాడు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.బీసీ ఉద్యమాన్ని మండల స్థాయిలో విస్తరించి గ్రామస్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా పర్యటనలు చేపట్టినట్టు పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బీసీలకు జరిగిన అన్యాయాలను గ్రామస్థాయిలో ప్రజలకు వివరించేందుకు ఈ పర్యటనలు నిర్వహిస్తున్నామని చెప్పారు.కోర్ కమిటీ సభ్యుడు పెద్దవూర బ్రహ్మయ్య మాట్లాడుతూ, గ్రామాల్లో నివసించే బీసీలు తమను తాము బీసీలమని గుర్తించుకునే వరకు అవగాహన కల్పించే బాధ్యత మన ఆలోచన సాధన సమితిపై ఉందన్నారు. యువత, మహిళలు బీసీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాలని, 15 నుంచి 20 కులాలు అసెంబ్లీ, పార్లమెంటుల్లో అడుగుపెట్టినప్పుడే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు.ఈ నేపథ్యంలో సమితి గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో తిరుగుతూ చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నేరెళ్ల దేవేందర్, ఆవుల వెంకటేష్ యాదవ్, మంగ్లీ శంకర్, గంగపుత్ర పెద్దవూర బ్రహ్మయ్య, రజక రమేష్, చారి మురళీధర్, గౌడ్ వినోద్ కుమార్, రమేష్ గౌడ్, ఆకుల శ్రీనివాస్, దయానంద్ చారి, చందు ముదిరాజ్, మల్లేష్ యాదవ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments