హయత్‌నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో కుంట్లూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

హయత్‌నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో కుంట్లూర్ లో  ఘోర రోడ్డు ప్రమాదం

హయత్‌నగర్ /కుంట్లూర్/ నగర నిజం  : హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూర్ గ్రామంలో మంగళవారం నాడు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నారాయణ కాలేజ్ (బాసర క్యాంపస్) సమీపంలో ఉదయం 5.45 గంటల సమయంలో స్కోడా కారు (నంబరు MH-02-DG-0771) , డీసీఎం వాహనం (నంబరు TS-07-UK-2664) ఒకదానికొకటి ఢీకొన్నాయి.పసుమాముల నుంచి కుంట్లూర్ వైపు వస్తున్న స్కోడా కారు, కుంట్లూర్ నుంచి పసుమాముల వైపు వెళ్తున్న డీసీఎం వాహనం మధ్య నారాయణ కాలేజ్ సమీపంలో ఉన్న మలుపు వద్ద వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. వారు:
పిన్నింటి చంద్రసేన రెడ్డి (24),
చుంచు త్రినాథ్ రెడ్డి (24),
చుంచు వర్షిత్ రెడ్డి (23) — అని గుర్తించారు.
ఇతర వ్యక్తి అలిమేటి పవన్ కల్యాణ్ రెడ్డి (24) గాయపడ్డాడు. గాయపడిన అతన్ని హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ హాస్పిటల్‌కు తరలించారు. మృతులు, గాయపడిన వ్యక్తి  నలుగురూ కుంట్లూర్ నివాసితులుగా గుర్తించారు.ఈ ప్రమాదంపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు
మేడ్చల్:- మేడ్చల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు మారినట్లు విద్యుత్ శాఖ మేడ్చల్ ఏ.డి రాజ మల్లేష్ తెలిపారు కావున ఏదైనా...
నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు
కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమా?
మొద్దు లచ్చిరెడ్డికి సమస్యలపై వినతిపత్రం అందజేసిన గౌతమి నగర్ కాలనీ వాసులు
రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హయత్‌నగర్‌లో నివాళులు
బీసీల చైతన్యానికి గ్రామపర్యటనలు
రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు