వేసవి సెలవులలో కూడా ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం హర్షనీయమని

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం

వేసవి సెలవులలో కూడా ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం హర్షనీయమని

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : (NAGARA NIJAM) : ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ  యుగంలో విద్యాబోధన సామర్ద్యాలను పెంపొందించేందుకు వేసవి సెలవులలో కూడా ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం హర్షనీయమని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం అన్నారు.శుక్రవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాచారం లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఉపాధ్యాయులకు  నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టరు హాజరైనారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ టెక్నాలజి పరంగా విద్యాబోధన సామర్ద్యాలను పెంపొందించేందుకు విద్యారంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా ఉపాధ్యాయులు తమని తాము ఎప్పుడు అప్ డేట్ చేసుకుంటూ   విద్యార్థులకు బోధించాలన్నారు.  తరగతి గదిలో విద్యార్థులు అందరు ఒకేలా నేర్చుకోలేరు, వారికి ఎలా అవసరమో ఆవిధానాన్ని గ్రహించి విద్యనందించడమే ఉపాధ్యాయుల గొప్పతనమన్నారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఇన్ స్టాల్ చేసుకొని నేర్చుకోవాలని ఉపయోగించుకోవాలన్నారు.  ఈ  శిక్షణలో భాగంగా ఎన్ని పద్దతులలో శిక్షణ ఇవ్వగలరో అన్ని పద్దతులు తెలుసుకొని విద్యార్థులకు అవసరమైన విధంగా భోధించాలన్నారు జిపిటియాప్  వినియోగించుకొని  విద్యారంగాన్ని మరింత మెరుగుపరచాలని, అందుకనుగుణంగా ఈ టెక్నాలజీ పై పట్టు సాధించాలన్నారు. టెక్నాలజీ ద్వారా వ్యక్తిగత సామర్థ్యాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలన్నారు. టెక్నాలజీ విషయంలో మనకంటే పిల్లలే ముందున్నారన్నారు. ఈయాప్ ద్వారా ప్యానల్ ను ఎలా ఉపయోగించాలి, కంటెంట్ ను స్పష్టంగా ఎలా తెలియజేయాలి అనే అవగాహాన పెంచుకోవాలన్నారు. మన పిల్లలకు ఉత్తమ ఫలితాలు ఇవ్వడం మనందరి బాధ్యత అని కలెక్టరు అన్నారు. విద్యార్థుల్లో చదవడం, వ్రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను పెంచడానికి  ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అదేవిధంగా  విద్యార్థుల పఠణస్థాయిని పెంచాలన్నారు.  ఉపాధ్యాయులు ఈ శిక్షణ తరగతులను వినియోగించుకొని, వీటి పై మీ అనుభవాలు, ఆలోచనలు,  సలహాలు, సూచనలు తప్పనిసరిగా ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని కలెక్టరు కోరారు.అనంతరంఈ శిక్షణ కార్యక్రమంలో ఉపాధ్యాయుల అనుభవాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో విద్యాశాఖ జాయింట్  డైరెక్టరు మదన్ మోహన్, జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మి, ఉప్పల్ తహాసీల్దారు వాణి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు
మేడ్చల్:- మేడ్చల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు మారినట్లు విద్యుత్ శాఖ మేడ్చల్ ఏ.డి రాజ మల్లేష్ తెలిపారు కావున ఏదైనా...
నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు
కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమా?
మొద్దు లచ్చిరెడ్డికి సమస్యలపై వినతిపత్రం అందజేసిన గౌతమి నగర్ కాలనీ వాసులు
రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హయత్‌నగర్‌లో నివాళులు
బీసీల చైతన్యానికి గ్రామపర్యటనలు
రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు