మే 20న జరిగే దేశవ్యాప్త సర్వత్రిక సమ్మెను జయప్రదం చెయ్యాలని మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో పోస్టర్ ని రిలీజ్ .
మేడ్చల్. సిఐటియు మేడ్చల్ మండల కన్వీనర్ ఏం.పి.నరేష్ మాట్లాడుతూ మున్సిపాల్టీలలోని 75 వేల మంది మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఎన్ఎంఆర్, ఫిక్స్డ్ పే తదితర పద్ధతుల్లో పనిచేస్తున్న కార్మికులున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక భద్రత కల్పించడంలో నిర్లక్ష్యంగా ఉన్నాయి, సామాజిక భద్రతా చట్టం ప్రకారం ఏ ఉద్యోగి/కార్మికునికైనా వైద్య సదుపాయం, ప్రమాద బీమా, పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్, పెన్షన్, ప్రసూతి ప్రయెజనాల లాంటి సదుపాయాలు కల్పించాలి, కార్మికులకు కొంతమేరకైనా రక్షణ కల్పిస్తున్న ఈ 29 చట్టాలను మోడీ ప్రభుత్వం సులభతర వ్యాపారం పేరుతో వాటిని రద్దు చేసి 4 లేబర్ కోడ్ల అమలుకు ప్రయత్నిస్తున్నది అని మండిపడ్డారు. కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం కార్మికులపైన, కార్మిక హక్కులపైన ఎక్కుపెట్టిన యుద్ధంలో కార్పొరేట్-మతోన్మాద అనుకూల విధానాలు, కార్మిక కోడ్ లు ముఖ్యమైన భాగం, పని పరిస్థితులలో మార్పులు, ట్రేడ్ యూనియన్ హక్కులు హరించడం, శ్రమ దోపిడీని తీవ్రతరం చేసి కార్పొరేట్ల లాభాపేక్ష నెరవేర్చడం కోసం పాలకుల అండతో శ్రామికవర్గంపై చేస్తున్న దాడిని ప్రతిఘటించాలి కోరారు. ఈ సంకల్పంతో 2025 మే-20న జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో మున్సిపల్ ఉద్యోగ, కార్మికులందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు మున్సిపల్ కార్మిక యూనియన్ నాయకులు ఎన్.మల్లేష్, మామిండ్ల మల్లేష్, బి.లక్ష్మ రెడ్డి, గోటిముకుల రాజు, స్వామి, సురేష్, రవి, శ్రీనివాస్ రెడ్డి, కొత్తపల్లి రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments