పదో తరగతి లో పాసయ్యింది....ప్రేమికుడి చేతిలో ఓడిపోయింది

ఉరివేసుకొని మైనర్ బాలిక ఆత్మహత్య

పదో తరగతి లో పాసయ్యింది....ప్రేమికుడి చేతిలో ఓడిపోయింది

ప్రేమ పేరుతో మైనర్ బాలికను వంచించిన రవి

ప్రేమ వ్యవహారమే కారణంగా తేల్చిన శంషాబాద్ పోలీసులు 

నిందితుడు తెలగమల్ల రవి అరెస్ట్, కేసు నమోదు 

శంషాబాద్ (మం) లోని పెద్దతూప్ర లో ఘటన

రాజేంద్రనగర్, మే 18(నగరనిజం ప్రతినిధి): చదువుల బడిలో గెలిచింది... తోటి విద్యార్థులతో పోటీపడుతూ పదో తరగతిలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యింది.... బట్ ప్రేమికుడి చేతిలో వంచనకు గురైన ఆ అభాగ్యురాలు జీవితంపై విరక్తితో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడి తనువు చాలించింది. మరోవైపు బాలిక ఆత్మహత్యకు కారకుడైన ప్రేమికుడిని శంషాబాద్ రూరల్ పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం లోని పెద్దతూప్ర గ్రామంలో చోటుచేసుకుంది. పెద్దతూప్ర గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటనకు సంబంధించి శంషాబాద్ రూరల్ పోలీసులతో పాటు బాధితుల కథనం ప్రకారం వివరాలు....పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. పెద్దతూప్ర గ్రామానికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలిక ఇటీవల పదవ తరగతి పరీక్షల్లో 474 మార్కులతో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. అయితే అదే గ్రామానికి చెందిన తెలగమల్ల రవి (25) అనే యువకుడు ప్రేమ పేరుతో గత కొన్ని రోజులుగా బాలిక వెంటపడుతున్నాడు. ఈ క్రమంలో ప్రేమ పేరుతో బాలికను లొంగదీసుకున్న నిందితుడు రవి....ఇటీవల బాలికను తన వెంట తీసుకెళ్లాడు.దీంతో బాలిక కుటుంబ సభ్యులు తమ కూతురు కనిపించడం లేదంటూ శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకేముంది బాలిక మైనర్ కావడంతో భయాందోళనకు గురైన రవి..... ఆమెను పెద్దతూప్ర గ్రామంలో వదిలేసి జారుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రేమికుడి చేతిలో ప్రేమ వ్యవహారం తో జీవితంలో ఓడిపోయానని కలత చెందిన బాలిక..... తన ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శంషాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు....బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శనివారం నాడు పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు నిందితుడు రవిని అదుపులోకి తీసుకొని పోక్సో మరియు కిడ్నాప్ నేరం కింద కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శంషాబాద్ పోలీసులు ప్రకటించారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు
మేడ్చల్:- మేడ్చల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు మారినట్లు విద్యుత్ శాఖ మేడ్చల్ ఏ.డి రాజ మల్లేష్ తెలిపారు కావున ఏదైనా...
నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు
కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమా?
మొద్దు లచ్చిరెడ్డికి సమస్యలపై వినతిపత్రం అందజేసిన గౌతమి నగర్ కాలనీ వాసులు
రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హయత్‌నగర్‌లో నివాళులు
బీసీల చైతన్యానికి గ్రామపర్యటనలు
రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు