కుంట్లూరు చౌరస్తా నుండి తట్టి అన్నారం నాగోల్ దారిలో ప్రమాదకర మలుపులు
కుంట్లూరు చౌరస్తా నుంచి తట్టి అన్నారం, నాగోల్ వైపు వెళ్లే రోడ్డులోని మూల మలుపులు రెండు మూడు చోట్ల ఉండడం తీవ్ర ప్రమాదాలకు దారితీస్తున్నది. ఈ మలుపుల వద్ద దారిలో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడం, వీధి దీపాలు లేకపోవడం,స్పష్టమైన సూచికలు, రోడ్డుకు డివైడర్ సదుపాయం లేకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి.ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని స్థానికులు తెలిపారు. వాహనదారులు ఆటు, ఇటు నుంచి వాహనాలు వస్తున్నాయో తెలుసుకునే అవకాశం లేకుండా పోతుండటంతో ప్రాణహానికే అవకాశం ఏర్పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదకరంగా మారిన ఈ మలుపుల వద్ద తగిన సూచిక బోర్డులు, రోడ్డు డివైడర్ ఏర్పాట్లు చేయాలని కోరుతూ... ప్రభుత్వం స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు శాఖ అధికారులు ఇంతవరకూ స్పందించకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది..
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments