రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హయత్‌నగర్‌లో నివాళులు

రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హయత్‌నగర్‌లో నివాళులు

1991 మే 21న తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబుదూరులో దేశాన్ని కంటతడి పెట్టించిన ఘటన చోటుచేసుకుంది. అప్పటి యువ ప్రధాని రాజీవ్ గాంధీ విద్రోహుల హత్యాకాండకు బలైపోయారు. ఈ రోజు (2025 మే 21) ఆయన 34వ వర్ధంతి సందర్భంగా హయత్‌నగర్‌లోని సాయిబాబా గుడి చౌరస్తాలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.రాజీవ్ గాంధీ సేవలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని హయత్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెన్నాగోని రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కరంటోత్ పాండు నాయక్, మేగవత్ గోవర్ధన్ నాయక్, ఎర్ర మహేందర్, దాసరి మోని శ్రీను, ముద్దగోని నగేష్, ఎల్బీ నగర్ యువ కాంగ్రెస్ జెనరల్ సెక్రటరీ మనోజ్, నేనావత్ జైపాల్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

ఏసిబికి పట్టుబడ్డ జీఎస్టీ ఆఫీసర్ ఏసిబికి పట్టుబడ్డ జీఎస్టీ ఆఫీసర్
నాంపల్లి, జూలై 8 (నగర నిజం): జి.ఎస్.టి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతికి పాల్పడిన కమర్షియల్ ట్యాక్స్ శాఖాధికారి ఏసీబీకి చిక్కాడు. మాదాపూర్ సర్కిల్‌లో డిప్యూటీ స్టేట్ ట్యాక్స్...
స్వామి వివేకానంద,దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు
ప్రమాదవశాత్తు ఆటోల నుండి పడి వ్యక్తి మృతి
మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్‌.. రోడ్డుపై వృధాగా పోతున్న నీరు
అన్ని న్యాయస్థానాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటం పెట్టాలిని జనరల్ రిజిస్టార్ కు వినతి 
3 కోట్లు విలువైన ఏనుగు దంతాలు పట్టుకున్న
రోడ్డు వేయడం మర్చిపోయారు...?