జవాన్ల ప్రాణత్యాగం వెలకట్టలేనిది
జవాన్ల ప్రాణత్యాగం వెలకట్టలేనిది
ఆర్మీ జవాన్ మురళినాయక్ కు ఘన నివాళి
ఇబ్రహీంపట్నం, మే 10 ( నగరనిజం ) : దేశ భద్రత కోసం ఆర్మీ జవాన్లు ప్రాణత్యాగం వెలకట్టలేనిదని బీఆర్ఎస్వి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్ కుమార్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా శనివారం ఇబ్రహీంపట్నంలో జమ్ముకాశ్మీర్ యుద్ధభూమిలో మన దేశం కోసం విరోచితంగా పోరాడుతు.. వీర మరణం పొందిన మన భరతమాత ముద్దుబిడ్డ ఇండియన్ ఆర్మీ జవాన్ ఎం.మురళీ నాయక్ యొక్క చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి క్రొవత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్ కుమార్ మాట్లాడుతూ... ఆపరేషన్ సిందూర్ లో భారత సైనికులు మరణించడం చాలా బాదకరమని అన్నారు. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్న వీర సైనుకులకు ప్రతి పౌరుడు అండగా ఉండాలని కోరారు. జవాన్ల త్యాగం వెలకట్టలేనిదని, వారి సేవలు దేశానికి గర్వకారణమని తెలిపారు. మావోయిస్టులు చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని, హింసామార్గాన్ని విడనాడాలని ఆయన కోరారు. అదే విదంగా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్థిస్తున్నదని, పాకిస్తాన్ పై యుద్ధం చేస్తున్న సైన్యానికి ప్రతి ఒక్కరు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండ్రు రవి, చెరుకూరి భరత్, ధనరాజ్, వంశీ, ఏర్పుల ప్రసాద్, గరిగే శేకర్, సాగర్, మహేష్, ముత్యం, సురేష్, బన్నీ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.