తొండుపల్లి వద్ద కారులో చెలరేగిన మంటలు
తగలబడుతున్న కారు
రాజేంద్రనగర్, మే 12,(నగరనిజం ప్రతినిధి):రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి వద్ద నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల దాటికి కారు పూర్తిగా కాలి బూడిదయింది. మరోవైపు మంటలను గమనించిన డ్రైవర్ కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పి వేయించారు. ఈ ఘటన తొండుపల్లి వద్ద హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం నాడు చోటుచేసుకుంది. శంషాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి కథనం ప్రకారం... టాటా జస్ట్ కారు ( టీఎస్ 11, యుబి 7861) తొండుపల్లి వద్ద రైల్వే బ్రిడ్జి వద్దకు చేరుకోగానే ఉన్నట్లుండి ఇంజన్ లో నుండి మంటలు చెలరేగాయి. హైదరాబాద్ లోని ఎల్బీనగర్ నుండి షాద్నగర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.అయితే మంటలను గమనించిన కారు డ్రైవర్ హుస్సేన్ (31) కింద దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు మంటలు ఆర్పి వేయించారు. కారు ఇంజన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నట్లు సీఐ నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments