వివేరా హాస్పటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ శిబిరం
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం గౌరెల్లి గ్రామంలో గౌరెల్లి గుట్ట శ్రీ స్వయంభు స్వర్ణ గిరి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా హయత్ నగర్ వివేరా హాస్పటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ శిబిరం నిర్వహించారు. ఈ శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎల్బీనగర్ డీసిపి, అదనపు డీసీపీ, నాగోల్ సీఐ, పోలీసు అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, వివేరా హాస్పిటల్ డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.అనంతరం వివేరా హాస్పటల్ చైర్మన్ ఎం.ఉపేందర్ గౌడ్, మేనేజింగ్ డైరెక్టర్స్ నాగబాబు, శ్రీకాంత్, డైరెక్టర్ ధర్మ, సీఈఓ మానస గౌడ్, ఆర్ఎంఓ డాక్టర్ కీర్తి, జనరల్ మేనేజర్ నక్క రంజిత్ గౌడ్, మాట్లాడుతూ ..... గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు చేరేలా చేయడమే తమ లక్ష్యమన్నారు. ఈ తరహా శిబిరాల ద్వారా గ్రామస్తులు ఆరోగ్యపరంగా సజాగ్రత్తలు తీసుకోవచ్చని తెలిపారు. హాస్పటల్ తరఫున భవిష్యత్తులో ఇంకా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments