డా. నొముల వెంకటేశ్వర్లుకు తెలంగాణ ఉత్తమ మానసిక నిపుణుడు అవార్డు

డా. నొముల వెంకటేశ్వర్లుకు తెలంగాణ ఉత్తమ మానసిక నిపుణుడు అవార్డు

అవార్డు అందుకుంటున్న నోముల వెంకటేశ్వర్లు

హైదరాబాద్, మే 11/నగర నిజం : ప్రముఖ మానసిక నిపుణుడు డా. నొముల వెంకటేశ్వర్లుకు 2025 ఉత్తమ మానసిక నిపుణుడు అవార్డు లభించింది. హైదరాబాద్ బిర్లా ప్లానెటేరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డు అందజేశారు. ఈ అవార్డును మాజీ మంత్రి డా. టి. వెంకట్ రత్నం, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నెరెళ్ల శారద, ఐఏఎస్ అధికారి పి. నరహరి కలిసి ప్రదానం చేశారు."హ్యూమన్ మెడిసిన్", "ఎనర్జీ గివర్", "హ్యాపినెస్ కోచ్" లాంటి బిరుదులతో గుర్తింపు పొందిన డా. వెంకటేశ్వర్లు ఇప్పటివరకు 5000 మందికి పైగా విద్యార్థులు, వ్యక్తులకు కౌన్సిలింగ్ చేశారు. పలు ప్రముఖ కంపెనీలు, విద్యా సంస్థలు, కుటుంబాలకు కన్సల్టెంట్ సైకాలజిస్టుగా సేవలందిస్తున్నారు.ప్రస్తుతం హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సహాయ ప్రొఫెసర్‌గా ఉన్న డా. వెంకటేశ్వర్లు, రెండు ప్రభుత్వ కళాశాలలకు NAAC A గ్రేడ్ accreditation రావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన విద్యార్థులలో చాలామంది రాష్ట్ర, జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన, గతంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా సేవలందించారు. మానసిక శాస్త్రంపై పలు పుస్తకాలు, వ్యాసాలు రచించడంతో పాటు, పదేళ్లుగా ఉచిత కౌన్సిలింగ్ కేంద్రాలు నడుపుతున్నారు.డా. వెంకటేశ్వర్లుకు లభించిన ఇతర గౌరవాల్లో గవర్నర్ రంగరాజన్ నుండి గోల్డ్ మెడల్, JCI ఇంటర్నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు, గాంధీ గ్లోబల్ పీస్ ఫౌండేషన్ విద్యా సేవా రత్న, యువ కళా పురస్కార్, కర్గిల్ ఆన్‌లైన్ క్విజ్ విజేత అవార్డు ఉన్నాయి. అలాగే అనేక సంస్థలు, సంఘాల నుంచి ఆయనకు ప్రశంసలు లభించాయి.NLI గుంటూరు, వివిధ విశ్వవిద్యాలయాలు, అకడమిక్ స్టాఫ్ కాలేజీలలో విజిటింగ్ ఫ్యాకల్టీగా ఉన్న ఆయన, NSS, NCC, IQAC కోఆర్డినేటర్, స్టాఫ్ క్లబ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. స్పోర్ట్స్‌లో ఆసక్తి ఉన్న ఆయన, హోలిస్టిక్ డెవలప్‌మెంట్ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నారు.SVYASA యోగా టీచర్ సర్టిఫికేషన్, ఇషా ఫౌండేషన్ ఇన్నర్ ఇంజనీరింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సులు పూర్తి చేసిన డా. వెంకటేశ్వర్లు, యోగ మరియు మానసిక శాస్త్రాన్ని కలిపి ప్రజలకు మెరుగైన మానసిక ఆరోగ్యం అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు."బిజినెస్ కుటుంబం నుంచి వచ్చినా, బోధన మరియు మానసిక శాస్త్రం నా రెండు కన్నులు. ప్రతి మనస్సులో వెలుగు నింపాలనే, విద్యార్థులకు వేల ఏనుగుల శక్తిని, కౌన్సిలింగ్ పొందే వారికి శాంతిని అందించాలనే నా జీవిత లక్ష్యం," అని డా. వెంకటేశ్వర్లు తెలిపారు.జైళ్లలో ఖైదీలకు కౌన్సిలింగ్ అందించిన ఆయన పెద్ద కుమారుడు ఎన్. సుహాస్ గుప్తా మెడిసిన్ విద్యార్థిగా, చిన్న కుమారుడు సుజన్ గుప్తా నేషనల్ క్విజ్ ఫైనలిస్ట్‌గా ఉన్నారు.మే – మెంటల్ హెల్త్ అవేర్‌నెస్ మంత్ సందర్భంగా ఈ అవార్డు లభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

 

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News