నాగోల్ లో సింధూర్ ఆపరేషన్ విజయోత్సవం సందర్భంగా రామాలయంలో పూజలు
పహాల్గం ఉగ్ర దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ చేపట్టిన ఎదురుదాడికి మద్దతు పలుకుతూ ,పాక్ సరిహద్దుల్లో భారత జవాన్లకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ నాగోల్ డివిజన్ లోని ఇంద్రప్రస్థ కాలనీలో రామాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది , ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞత కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు సామ రంగారెడ్డి , నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ అనంతరం వారు మాట్లాడుతూ...భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ప్రతి శత్రువు కి దీటైన సమాధానం దొరుకుతుందని అన్నారు పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రతి భారతీయుడు గర్వపడుతున్నారని తెలియజేశారు అను నిత్యం దేశానికి సైనికుడుగా పని చేస్తున్న నరేంద్ర మోడీ బాగుండలని ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, మహిళ నాయకులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్