బాటసింగారంలో శ్రీశ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానంలో
నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట, 29వ కళ్యాణ మహోత్సవ వేడుకలు
అబ్దుల్లాపూర్ మెట్/నగరనిజం: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం గ్రామంలో శ్రీశ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట, 29వ కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలు మే 7 నుండి 10వ తేదీ వరకు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.వేడుకల సందర్భంగా ఉదయం నుంచే భక్తులు దేవాలయానికి భారీ సంఖ్యలో చేరుకొని వీరబ్రహ్మేంద్రస్వామి ఆశీస్సులు పొందారు. మే 9 న ధ్వజస్తంభ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి శ్రీమత్ పరమహంస పరి వాజ్రక చార్య జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీ శ్రీ నరసింహ భారతి స్వామి పీఠాధిపతుల ఆధ్వర్యంలో శ్రీ పుష్పగిరి శారద లక్ష్మీనరసింహ పీఠం వారి కరకములములచే యంత్ర ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం శ్రీ గోవిందా మాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం , 10 వ తేదీన స్వామి వారు ఊరేగింపు తదితర కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి, నేషనల్ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, బీజేపీ ఓబీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తల్లోజు ఆచారి, తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదన్ చారి తదితరులు పాల్గొన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ వీరబ్రహ్మేంద్రస్వామి చూపిన మార్గం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. భక్తులు సమాజంలో ఏకతా, శాంతి, ధర్మపరాయణతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.దేవాలయ కమిటీ అధ్యక్షులు కొండోజు బాలకృష్ణ చారి మాట్లాడుతూ... ప్రతి ఏటా కళ్యాణ మహోత్సవాలను భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో గత 4 రోజుల నుంచి మహోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ వేడుకలకు గ్రామ ప్రజలు దాతలు కుల బంధువులు సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. శ్రీ దేవాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు కొండోజు బాలకృష్ణ చారి, ప్రధాన కార్యదర్శి ఎర్రవల్లి ఉమాకాంత్ చారి, కోశాధికారి నాగార్జున ఉపేంద్ర చారి, ఉపాధ్యక్షులు మల్లోజు విశాల చారి, వెంకటాపురం జానకిరామ్ చారి, ధ్వజస్తంభ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మల్లోజు శ్రీనివాస్ చారి, ఉపాధ్యక్షులు వాడపు భాను చారి, కొండోజు సాయి తేజ చారి ,ధ్వజస్తంభ ప్రతిష్టా ప్రభుత్వ కమిటీ సభ్యులు,ముఖ్య సలహాదారులు,దేవాలయ నిర్మాణ మాజీ అధ్యక్షులు ఎర్రవెళ్ళి బాల బ్రహ్మచారి,ఎర్రవెళ్ళి పట్టాభి రామాచారి, ఎర్రవెళ్ళి కిషన్ చారి, గుంటోజు రమేష్ చారి, ఎర్రవెళ్ళి ప్రేమ్ చారి, ఎర్రవెళ్ళి మురళీధర్ చారి, ఎర్రవెళ్ళి గౌరీ శంకర్ చారి ( మాజీ సర్పంచ్ ) , ఎర్రవెళ్ళి సుధాకర్ చారి, ఎర్రవెళ్ళి నరసింహ చారి ,కొండోజు సీతయ్య చారి, కొండోజు విఠలాచారి, కొండోజు నరేందర్ చారి,ఎర్రవెళ్ళి మారుతి ప్రసాద్ చారి ,కొండోజు వెంకటేశ చారి ,ఎర్రవెళ్ళి బ్రహం చారి ,ఎర్రవెళ్ళి వినోద్ కుమార్ చారి, వాడేపు బ్రహ్మచారి, ఎర్రవెళ్ళి విజయ చారి, ఎర్రవెళ్ళి పద్మాచారి, పసుపుల హరిప్రసాద్ చారి, కొండోజు పెంటయ్య చారి, నాగార్జున కృష్ణ చారి, మల్లోజు నిత్యానందము చారి, కొండోజు బ్రహ్మచారి, ఎర్రవెళ్ళి నవీన్ చారి , కొండోజు రవి చారి, ఎర్రవెళ్ళి వేణు ప్రకాష్ చారి, మల్లోజు నవీన్ చారి, ఎర్రవెళ్ళి శ్రవణ్ చారి, ఎర్రవెళ్ళి సతీష్ చారి, వెంకటాపురం విజయ చారి, ఎర్రవెళ్ళి గణేష్ చారి, కొండోజు నాగేశ్ చారి, కొండోజు సురేష్ చారి, కొండోజు హరిప్రసాద్, వెంకటాపురం శ్రవణ్ చారి,ఎర్రవెళ్ళి రవికిరణ్ చారి, కొండోజు సుదీప్ చారి, కొండోజు పవన్ చారి, కొండోజు సాయిప్రసాద్ చారి, గుంటోజు తేజ చారి, మల్లోజు సాయి వర్ధన్ చారి, ఎర్రవెళ్ళి బాను చారి, వాడపు శివతేజ చారి, నాగార్జున శశాంక్ చారి, ప్రతిష్ట పర్యవేక్షకులుగా బ్రహ్మ విశ్వవిధాంగా ఋషి పురోహిత సామ్రాట్, ప్రతిష్టాచార్యులు చౌదరి మెట్టు మల్లేషు చార్యలు ,చౌదరి మెట్టు శ్రీనివాసాచార్యులు, రాచకొండ వేణు కుమార్ ఆచార్యులు, సేవలు అందించారు. ఆలయ ప్రధాన అర్చకులు నాగార్జున వేణుగోపాలచార్యులు, నాగార్జున ఉపేంద్ర చార్యులు, నిత్య పూజ అర్చకులు వాడేపు రంగాచారి, గోరంట్ల ధనంజయ నేత విశేష సేవలు అందించారు. పత్రికల ప్రచారణకర్తగా ఎర్రబెవెళ్ళి పట్టాభి రామాచారి బాధ్యతలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, కుల బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్