17 ఏండ్ల కలయిక...అవదుల్లేని ఆనందం
ఆప్యాయ పలకరింపులు...ఆత్మీయ కరచాలనాలు
ఘనంగా పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం
17 ఏండ్ల కలయిక... అవదుల్లేని ఆనందం
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ఇబ్రహీంపట్నం, మే 12 ( నగరనిజం ) : ఆప్యాయ పలకరింపులు.. ఆత్మీయ కరచాలనాలు... భావోద్వేగ సన్నివేశాలు వెరసి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వేదికయింది. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పోల్కంపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన 2007 - 08 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు పోల్కంపల్లి ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ఒకేచోటుకు చేరి ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు 17 సంవత్సరాల తరువాత కలుసుకొని చాలా ఉత్సహంగా గడిపారు. గతాన్ని నెమరేసుకొని ఆనందంగా గడిపారు. ఒకరితో ఒకరు గతాన్ని పంచుకున్నారు. ముందుగా భారత్ - పాక్ యుద్ధంలో మరణించిన వీర జవాన్లకు, నాటి ఉపాధ్యాయురాలు వసంత, తోటి స్నేహితులకి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఆత్మీయ సమ్మేళనంలో ఉపాధ్యాయులు హాజరై మాట్లాడారు... విద్యార్థులంతా ఒక్కొక్కరూ ఒక్కో రంగంలో సెటిల్ అవ్వడం, స్థిరపడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అప్పటి క్రమశిక్షణ నేడు విద్యార్థుల జీవితంలో స్థిరపడటానికి ఉపయోగపడిందని గుర్తు చేశారు. అన్నింటికీ మించిన బంధం స్నేహబంధం ఒక్కటేనని, కులమాతాలకు అతీతంగా ఉంటూ అందరూ కలిసి మెలిసి ఉండాలని చెప్పారు. ఆపదలో ఉన్న స్నేహితులను ఆదుకోవాలని కోరారు. విద్యార్థులు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సమస్యలు, విద్యా వ్యవస్థ మెరుగుపడడానికి గవర్నమెంట్ స్కూల్ పునర్జీవన కోసం అందరూ కలసి తోడ్పాటు అందించాలన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయుల కృషి, వారి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి ఎదిగిన స్నేహాన్ని మాత్రం మరువద్దన్నారు. భవిష్యత్తులో ఎవరికి ఏ కస్టం వచ్చినా తోటి స్నేహితులకు అండగా నిలబడాలనే నిర్ణయం తీసుకున్నారు. 17 సంవత్సరాల తర్వాత ఓకేచోట చేరడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అనంతరం అలనాటి గురువులకు జ్ఞాపికలు అందజేసీ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments