తుర్కయంజాల్ మున్సిపాలిటీ మునగనూరు munganur mpl premier league cricket tournament క్రికెట్ సంబరాలు
1 లక్ష మాజీ కౌన్సిలర్ స్వాతి అమరేందర్ రెడ్డి, 50 వేలు మాజీ వార్డ్ మెంబర్ గుత్తా వెంకటరెడ్డి అందజేశారు
మునగనూరు ప్రీమియర్ లీగ్ లో సన్ షైన్ టైగర్స్ విజేతగా నిలిచిన ఉత్సాహభరిత టోర్నమెంట్


తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని మునగనూరు గ్రామంలో గత వారం రోజులుగా ఎంతో ఉత్సాహంగా మునగనూరు ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. సాయిబాబా గుడి సమీపంలోని గ్రౌండ్ ఈ టోర్నీకి వేదికైంది. గ్రామ యువత, క్రికెట్ ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొని టోర్నమెంట్‌ను విజయవంతం చేశారు.ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో సన్ షైన్ టైగర్స్ జట్టు తన ప్రతిభను చాటుతూ విజేతగా నిలిచింది. ఫైనల్లో వారి ఆటతీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. విజేత జట్టుకు రూ.1,00,000 నగదు బహుమతి, ట్రోఫీలు,మెమెంటోలు అందజేశారు. ద్వితీయ బహుమతి పొందిన జట్టుకూ రూ.50,000 నగదు బహుమతి, గుర్తింపుగా ట్రోఫీలు , మెమొంటోలు అందించారు.ఈ లీగ్ నిర్వహణకు తుర్కయంజాల్ మున్సిపాలిటీ మాజీ వార్డు కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి ముఖ్యంగా లక్ష రూపాయల స్పాన్సర్‌గా సహకరించారు. అలాగే రెండో బహుమతిని మాజి మూడో వార్డు మెంబర్ గుత్తా వెంకట్ రెడ్డి ,మోహన్ గుప్తా తదితరులు సంయుక్తంగా అందించారని నిర్వాహకులు తెలిపారు.గ్రామస్థులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మ్యాచ్‌లను వీక్షించడం, ఆటగాళ్లను ప్రోత్సహించడం ఈ లీగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు ప్రత్యేక గుర్తింపులు, ఉత్తమ ఆటగాడిగా ఎంపికైనవారికి ప్రత్యేక ప్రశంసలు లభించాయి."గ్రామ యువతను క్రీడలవైపు మళ్లించి, వారిలోని ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఇటువంటి టోర్నమెంట్ నిర్వహించనున్నాం," అని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామానికి క్రికెట్ పట్ల కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చిందని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments