అమ్మకు అంకితమైన మదర్స్ డే వేడుకలు
అమ్మను మించిన దైవం లేదు
టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ ,టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ , అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా
నాగోల్: అమ్మను మించిన దైవము లేదని, మాతృదేవోభవ అనే మాటకు నిలువెత్తు నిదర్శనం అమ్మేనని టి.పి.సి.సి ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త తెలిపారు.నాగోల్ లోని శ్రీ అక్షయ ఓల్డ్ ఏజ్ హోమ్ లో మాతృమూర్తుల కోసం నిర్వహించిన మదర్స్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, కేకు కట్ చేసి మాతృమూర్తులకు స్నాక్స్, ఫ్రూట్స్, టవల్స్, అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడంతో పాటు చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో చందా భాగ్యలక్ష్మి, సేగు నలిని, కలకొండ మణిమాల, పోలా అర్చన, పద్మ పద్మజ, స్వాతి, పబ్బ చంద్రశేఖర్, కటకం శ్రీనివాస్, చంద్ర సుధాకర్, సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments