ఈటల రాజేందర్ మానవత్వం చాటారు
షామీర్ పేట వద్ద గాయపడ్డ వ్యక్తికి సహాయం
By NAGARA NIJAM
Views: 18
On
ఈటల రాజేందర్ తన ఇంటికి వెళ్తున్న సమయంలో షామీర్ పేట సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ఓ గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై కిందపడిపోతూ కనిపించాడు. వెంటనే తన వాహనం ఆపి, ప్రథమ చికిత్స అందించి అతన్ని ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఆ రోడ్డుపై లైట్లు సరిగా లేకపోవడం, లారీలు, కార్లు వేగంగా వెళ్లడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇదే రోడ్డులో ఈటల నివాసంలో పనిచేసే వ్యక్తి కూడా గతంలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనను ఆయన ఈ సందర్భంలో గుర్తు చేసుకున్నారు.
Tags:
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Latest News
09 May 2025 23:47:37
ఈటల రాజేందర్ తన ఇంటికి వెళ్తున్న సమయంలో షామీర్ పేట సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ఓ గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై కిందపడిపోతూ...