విశ్వకర్మ జేఏసీ ఏర్పాటు సమావేశాన్ని జయప్రదం చేయండి!
విద్యా, ఉద్యోగం, ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యమే జేఏసీ లక్ష్యం.
నేడు బీసీ సాధికారత భవన్, కోఠి, హైదరాబాదు నందు విశ్వకర్మ జేఏసీ ఏర్పాటు సమావేశం నిర్వహిస్తున్నట్లు జేఏసీ ముఖ్య నేతలు రాయబండి పాండురంగా చారి, ఎస్బిఎన్ చారి, తొవిటి సదానంద చారి, రుద్రోజ పురుషోత్తం చారి, మారోజు సోమాచారి, పూసల శ్రీకాంతాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విశ్వకర్మలకు అనేక సంఘాలు ఉన్నప్పటికీ వారికి దశ దిశ చూపించడానికి ఒక జేఏసీ అవసరమని అందుకు, నేడు జరుగుతున్న ఈ సమావేశానికి విశ్వకర్మలందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ జేఏసీ ని ఏర్పాటు చేయడంలో విశ్వకర్మలు రాష్ట్రంలో ప్రధాన పాత్రను పోషించడమే లక్ష్య దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు. రానున్న సార్వత్రిక, కార్పొరేటర్ ఎన్నికలలో విశ్వకర్మలకు అధిక ప్రాధాన్యం ఆయా పార్టీలు కల్పించాలని కోరారు. అత్యధికంగా విశ్వకర్మలను గెలిపించుకొనుటకు విశ్వకర్మ జేఏసీ పాటుపడుతుందని, విశ్వకర్మలలో ఉన్న యువ రక్తాన్ని ఈనాటి సమాజానికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతోనే జెఏసి గా ఏర్పడి తమకు కల్పించిన హక్కులను ప్రభుత్వం ద్వారా నెరవేర్చు కోవడానికి జేఏసీ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 33 జిల్లాల నుంచి విశ్వకర్మ కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలు, మేధావులు, రాజకీయవేత్తలు, డాక్టర్లు లాయర్లు జర్నలిస్టులు పాల్గొంటున్నారని తెలిపారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్