తమిళ, తెలుగు నటుడు విశాల్ మరోసారి అస్వస్థత
తమిళ, తెలుగు నటుడు విశాల్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా కూవాగం లోని కూత్తాండవర్ ఆలయంలో ఆదివారం రాత్రి జరిగిన ట్రాన్స్‌జెండర్ 2025 అందాల పోటీల్లో పాల్గొన్న విశాల్, వేదికపై స్పృహ తప్పి పడిపోయాడు. ఈ దృశ్యం చూస్తే అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే ప్రాథమిక చికిత్స అందించడంతో విశాల్ మెలకువకు వచ్చాడు. అనంతరం అక్కడకు వచ్చిన ఓ మంత్రి సహాయంతో ఆయనను హస్పటల్‌కు తరలించారు.ఇప్పటికే విశాల్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గతేడాది తన చిత్రం మదగజ రాజా ఈవెంట్‌కు తీవ్రమైన జ్వరంతో హాజరయిన ఆయన, వేదికపై మాట్లాడుతుండగా చేతులు వణికిన దృశ్యాలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అప్పట్లోనూ ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం కోలుకున్నారు.ఇప్పుడు మళ్లీ వేదికపై స్పృహతప్పడం విశాల్ ఆరోగ్యంపై చర్చకు దారి తీస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌మీడియాలో వేగంగా ప్రచారం అవుతున్నాయి.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments