అల్కాపురి కాలనీలో లక్ష్మీస్ హెయిర్ సెలూన్ అండ్ అకాడమీ ప్రారంభం
మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణ పురం డివిజన్‌లోని అల్కాపురి కాలనీలో లక్ష్మీ నాగేష్ నూతనంగా ప్రారంభించిన లక్ష్మీస్ హెయిర్ సెలూన్ అండ్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, టి.పి.సి.సి సభ్యుడు దెప భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు చిలుక ఉపేందర్ రెడ్డి, రామకృష్ణ పురం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న గణేష్, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ మధుసూదన్ రావు, ఖిల్లా మైసమ్మ దేవాలయం చైర్మన్ సురేష్, ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ తలాటి రమేష్, నేత కళ్యాణ్ యాదవ్, పెద్ద వూర సైదులు తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్