లక్ష్మీ సెలూన్ అండ్ అకాడమీ నూతన బ్యూటీ పార్లర్ ప్రారంభం
హైదరాబాద్, అలకాపురి / నగర నిజం: అలకాపురి ప్రాంతంలో లక్ష్మీ సెలూన్ అండ్ అకాడమీ నూతన బ్యూటీ పార్లర్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు సామ రంగారెడ్డి, ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ పాల్గొని ప్రారంభోత్సవాన్ని జరిపారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ మాట్లాడుతూ, పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్న ఈ సమయంలో స్వయం ఉపాధి పై యువత దృష్టి సారించడం ఎంతో శుభపరిణామమన్నారు. ఈ తరహా ప్రయత్నాలు ప్రతి ఒక్కరికీ ప్రేరణనివ్వాలన్నారు.నిర్వాహకులు నాగేష్, లక్ష్మీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుందర్ నారాయణ, వెంకట్ రెడ్డి, గట్టు మహేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment


Comments