సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఈ) ఫలితాలలో జీ హై స్కూల్ 100 శాతం ఉత్తీర్ణత
Zee High School Hayathnagar cbse
హయత్ నగర్,మే, 13(నగరనిజం): సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఈ) 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు మంగళవారం నాడు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా హయత్ నగర్ క్యాంపస్ లోనీ జీ హై స్కూల్ విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించడం గర్వకారణంగా నిలిచింది. పదవ తరగతి, ఇంటర్మీడియట్ విభాగాల్లో ప్రతి ఒక్క విద్యార్థులు ప్రతిభ కనబర్చడంపై పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ పూర్ణ దేవి శ్రీవత్సవ, సీఈఓ గిరిజా రెడ్డి, డైరెక్టర్లు సుదర్శన్ రెడ్డి, అనంతరెడ్డి, నాగేంద్రబాబు మాట్లాడుతూ... మా విద్యార్థులు ఈ గొప్ప ఫలితాలు సాధించడంలో ప్రధాన కారణం ఒత్తిడి లేకుండా విద్యాబోధన, ప్రోత్సాహకరమైన శిక్షణ పద్ధతులు, అంతర్జాతీయ స్థాయి క్రీడా సదుపాయాలు, ఇండోర్ గేమ్స్, యోగా, ధ్యానం వంటి అంశాలు అని తెలిపారు. అదే విధంగా నిపుణులైన ఉపాధ్యాయుల బోధన, విద్యార్థులపై మేనేజ్మెంట్ నిరంతర శ్రద్ధ, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని వివరించారు. ఈ ఫలితాల్లో ప్రత్యేకంగా కుర్ర అన్షిత 97.20 శాతం, అక్షత పాటక్ 97 శాతం, జెమిమ రాపాక 97 శాతం మార్కులతో స్కూల్కు అత్యుత్తమ ర్యాంకులు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించి, వారు సాధించిన విజయాలకు అభినందనలు తెలిపారు. విద్యార్థుల సాధన కొత్త రికార్డులకు నాంది పలుకుతుందంటూ వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments